దర్వాజ-జైపూర్
Katrina Kaif: ఈ రోడ్లు బాలీవుడ్ నటి కత్రీనా కైఫ్ బుగ్గల్లాగా ఉండాలని రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ నేత అందులోనూ మంత్రి ఇలా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యనే రాజస్థాన్ కేజినెట్ లో చోటుదక్కించుకున్న రాజేంద్ర సింగ్ గుడా తన నియోజక వర్గంలోని ఉడైపురవాటి ప్రాంతంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పర్యటించారు. ఇక అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రితో ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు.
అందులోనూ వారి ప్రాంతానికి రహదారులు సరిగ్గా లేవని.. వెంటనే అవి బాగు చేయించాలని మంత్రితో తెలిపారు. దానికి ఆయన అక్కడే ఉన్న పంచాయితీ రాజ్ ఇంజనీర్ వైపు చూసి .. ‘నా నియోజకవర్గంలోని రోడ్లు కత్రినీ కైఫ్ బుగ్గల్లా ఉండాలి’ కత్రీనా బుగ్గలు నాజుగ్గా ఉన్నట్లు రోడ్లుండాలంటూ ఆదేశించారు. ఇంకేముంది మంత్రి నోటి నుంచి హీరోయిన్ పేరు ఆ సందర్బంలో రావడంతో సమావేశానికొచ్చిన ప్రతి ఒక్కరూ ఉన్నఫలంగా నవ్వారు. ఇంకేముంది ప్రజలు మస్తు ఖుషీ అయ్యారని మంత్రి మళ్లోసారి కత్రినా కైఫ్ పేరును ప్రస్తావించారు. నా నియోజక వర్గంలోని ప్రజలు రహదారులతో ఇబ్బంది పడకుండా కత్రినా కైఫ్ బుగ్గల్లా నున్నగా, నాజుగ్గా రోడ్లు ఉండాలని ఆ ఇంజనీర్ ను ఆదేశించి అందరినీ విస్తుపోయేలా చేశారు.
మంత్రి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు నిమిషాల్లోనే వైరల్ గా మారాయి. ఇంకేముంది మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మంత్రి రాజేంధర్ పై విమర్షలు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రియాంక గాంధీ స్పందించి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇంతకుముందు 2005 లో ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు. ‘బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గల్లా నున్నగా ఉండేటట్లు చేస్తానని హామీ చేసి తీవ్ర విమర్శలకు గురైన విషయం తెలిసిందే.
రైల్వే ట్రాక్ పక్కనే వీడియో కోసం.. కానీ అంతలోనే..
తొడ భాగంలో కొవ్వు కరగాలా? అయితే ఈ టిప్స్ పాటించండి..
కూలీ డబ్బులు అడిగితే చేయి నరికిన యజమాని
చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెట్టింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Bigg Boss: బిగ్ బాస్ లీక్.. ఇంటి నుంచి ఈ వారం ఔట్ అయ్యేది..?
Gold: బంగారం కొనే వారికో గుడ్ న్యూస్..
ఆ పాట వింటే ‘రాధేశ్యామ్’స్టోరీ మొత్తం తెలిసిపోతుందట..
Papagni River: కూలిన పాపాగ్ని నది వంతెన.. నెల రోజులపాటు రాకపోకలు బంద్