• ప్రభుత్వానికి రైతులతో మాట్లాడే సమయం లేదా?
• బీజేపీ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు
దర్వాజ-లక్నో
Lakhimpur violence_Priyanka Gandhi: లఖింపూర్ ఖేరీ ఘటనలో నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను కాపాడేందుకు యూపీ సీఎం యోగి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. సీఎం ఎందుకు ఈ పని చేస్తున్నారు? తమను జైల్లో పెట్టి కొట్టినా సరే న్యాయం కోసం పోరాడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసిలో ఆదివారం ‘రైతులకు న్యాయం’ పేరుతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించింది.
ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ కేంద్రంలోని మోడీ, యూపీలోని యోగి ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. లక్నోను సందర్శించిన మోడీ లఖింపూర్ ఖేరీలో బాధిత రైతులను ఎందుకు పరామర్శించలేదంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిగా నిరసన తెలుపుతున్నా వారితో మాట్లాడేందుకు ప్రధాని మోడీకి సమయం లేదంటూ విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లఖింపూర్ ఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు.
అలాగే, దేశంలో ఒక వైపు ద్రవ్యోల్బణం, మరోవైపు నిరుద్యోగ సమస్య పెరుగుతుండగా.. ఇంకోవైపు రైతుల పరిస్థితులు సైతం దుర్బలంగా మారుతున్నాయని ప్రియాంగ గాంధీ ఆరోపించారు. ఈ కారణంగానే ప్రజలు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారన్నారు. మోడీ సర్కారు నిర్ణయాలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూ.. నిరుద్యోగులు పెరుగుతూ.. చిన్న వ్యాపారాలు మూతపడుతుండగా.. మోడీ ధనిక స్నేహితుల ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వంతో దేశంలోని పేదలు, దళితులు, మహిళలకు భద్రత లేకపోయినా మోడీ ధనిక స్నేహితులు మాత్రం బాగా ఉన్నారని విమర్శించారు.
ఢిల్లీ గాలి పీల్చుకోనివ్వట్లేదు !
భారీ వర్షంతో మళ్లీ నీటమునిగిన హైదరాబాద్. వైరలవుతోన్న వీడియోలు
లఖింపూర్ హింస: పోలీసుల ముందుకు కేంద్ర మంత్రి కుమారుడు
వాట్సాప్, ఫేస్ బుక్ లో మళ్లీ అదే సమస్య
యూపీ సర్కారు తీరుపై సుప్రీం అసంతృప్తి
తుమ్మును ఆపితే ఏం జరుగుతుందో తెలుసా?
రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న బేబమ్మ..
ఆఫ్ఘానిస్థాన్‌లో బాంబు పేలుడు.. 50 మంది మృతి
Share this content: