Loading Now
Tokyo Olympics 2020

ఒలంపిక్ లో భారత్ కు తొలి పతకం

దర్వాజ-న్యూఢిల్లీ

ప్ర‌పంచ క్రీడా సంగ్రామం టోక్యో ఒలంపిక్స్ 2020లో భార‌త్ త‌న స‌త్తాను ప్ర‌ద‌ర్శిస్తోంది. క్రీడ‌లు ప్రారంభ‌మైన రెండో రోజే వెయిట్‌ లిఫ్టింగ్ లో మెడ‌ల్ గెల‌వ‌డంతో పాటు పురుషుల హ‌కీ మొద‌టి గేమ్ లో విజ‌యం సాధించ‌డంతో భార‌త ఒలంపిక్ శిబిరంలో అత్మ‌విశ్వాసం మ‌రింత‌గా పెరిగింది.

దాదాపుగా 24 సంవ‌త్స‌రాల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో భారత కీర్తి పతాకను ఎగుర‌వేస్తూ.. సిల్వ‌ర్ మెడ‌ల్‌ను సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి ప‌త‌కాన్ని గెలుచుకుంది. దాదాపుగా 24 సంవ‌త్స‌రాల క్రితం 2000 సంవ‌త్స‌రంలో నిర్వ‌హించిన ఒలంపిక్స్ లో క‌ర‌ణం మల్లీశ్వ‌రి మ‌హిళ‌ల వెయిల్ లిఫ్టింగ్ విభాగంలో భార‌త్‌కు కాంస్య ప‌త‌కాన్ని అందించింది. మ‌ళ్లీ ఇప్పుడు మీరాబాయి చాను వెండి ప‌త‌కం గెలిచి.. చిరస్థాయిగా నిలిచే ఘనత అందుకుంది.

Share this content:

You May Have Missed