దర్వాజ-న్యూఢిల్లీ
Petrol and diesel taxes : గత కొంత కాలంగా చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ వాహనదారుల నడ్డివిరుస్తున్నాయి. పెట్రోల్ ధరల ప్రభావం ఇతర నిత్యావసరాలపై కూడా పడటంతో సామాన్య ప్రజానీకం లబోదిబో మంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న పన్నులను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు.
తాజాగా హర్దీప్ సింగ్ పూరీ మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధిస్తున్న పన్నులను సమర్థించారు. చమురుపై విధించిన పన్నులతోనే దేశంలో కరోనా టీకాలు ఉచితంగా అందించామన్నారు. కోవిడ్ సమయంలో లక్షలాది మందికి ఉచితంగా భోజనం అందించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంధన ధరల తగ్గించాలనీ, వాటిపై విధిస్తున్న పన్నులను సైతం తగ్గించాలని ప్రతిపక్ష పార్టీలు, ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు ఇదే తరహా వ్యాఖ్యలు చేయడంపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. కాగా, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు అన్ని నగరాల్లో సెంచరీ కొట్టాయి. కేంద్రం బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి చమురు పై విధిస్తున్న పన్నులు సైతం రెట్టింపు స్థాయిలో పెరిగినట్టు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.
బ్రెజిల్ అధ్యక్షుడిపై నేర అభియోగాలు
ప్రశ్నించినందుకు దాడిచేసిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్
ఉత్తరాఖండ్‌పై ప్రకృతి ప్రకోపం.. 47కు పెరిగిన మృతులు
Share this content: