Loading Now
Fuel prices hiked

Petrol Price: ఆగ‌ని పెట్రోవాత

• లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంపు
• అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ రెట్లు తగ్గినా దేశంలో చమురు ధరలు పైపైకి


ద‌ర్వాజ‌-ముంబ‌యి

Petrol, Diesel Price : దేశంలో పెట్రోల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో నిత్యం పెరుగుతున్న చమురు ధరలు వాహనదారులతో పాటు సామాన్య ప్రజానీకంపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. వరుసగా ఆరో రోజు సోమవారం కూడా చమురు ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున ధరలు పెరిగాయి. దీంతో దేశరాజధాని ఢల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.109.69, లీటరు డీజిల్‌ ధర రూ.98.42కు పెరిగింది.

దేశంలోని అన్ని నగరాల్లోనూ చమురు ధరలు ఎప్పుడులేనంతగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజాగా పెరిగిన చమురు ధరలు మధ్యప్రదేశ్‌లో కొత్త రికార్డులు నెలకోల్పుతున్నాయి. అక్కడ లీటరు పెట్రోల్‌ ధర రూ.120 దాటింది. దేశంలోనే అత్య‌ధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో లీట‌రు పెట్రోల్ ధ‌ర‌ రూ.121.52గా ఉంది. అక్కడ లీటర్‌ డీజిల్‌ రేటు రూ.112.4కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాఁ ముంబయిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.115.50, డీజిల్‌ 106.62కు చేరింది.

కోల్‌కతాలో పెట్రోల్‌ లీటర్‌ రూ.110.15, డీజిల్‌ రూ.101.56, చెన్నైలో పెట్రోల్‌ లీటర్‌ రూ.106.35, డీజిల్‌ 102.59కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ ధ‌ర రూ.114.19కు చేరుకుంది, ఇక లీటర్‌ డీజిల్‌ రూ.107.36గా ఉంది. ఏపీలో లీటరు పెట్రోల్‌ గరిష్ట ధర రూ.117.50, లీటరు డీజిల్‌ ధర రూ.109.99కు చేరింది.

అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు త‌గ్గుతున్నా..


అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతున్నప్పటికీ… దేశీయంగా చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం స‌ర్కారు విధిస్తున్న పన్నులేన‌ని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలకు అనుగుణంగా పెట్రో ధరలను రోజువారీగా సవరిస్తామని చెప్పిన కేంద్రం, చమురు కంపెనీలు.. వారం రోజులుగా క్రూడ్‌ ఆయిల్‌ ధర తగ్గుతున్నా.. మ‌న దేశంలో ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం లేదు. అక్టోబర్‌ 26న బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 86.5 డాలర్లు ఉండగా, 29 నాటికి 84 డాలర్లకు తగ్గింది.

COVID-19: కరోనా మరణాలు @ 50 లక్షలు

హ‌స‌రంగా హ్యాట్రిక్‌.. గెలుపు సౌతాఫ్రికాది !

నెల‌రోజుల‌కు పైగా ఉగ్ర‌రూపంలో లావా వెద‌జ‌ల్లుతున్న అగ్నిప‌ర్వ‌తం

Aryan Khan Drugs Case_ఆర్య‌న్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు

భ‌గ్గుమంటున్న చ‌మురు ధ‌రలు

పెగాస‌స్‌_దేశ ప్రజాస్వామ్యంపై దాడి !

ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ దొరికేనా…?

నేను బీజేపీ ఎంపీని.. ఈడీ నా జోలికి రాదు

Share this content:

You May Have Missed