Loading Now
Power Situation_Arvind Kejriwal

క్లిష్ట పరిస్థితుల్లో.. విద్యుత్‌ సంక్షోభం.. : కేజ్రీవాల్‌

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ
Power Situation_Arvind Kejriwal: దేశ రాజధానిలోని విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా మెరుగుపడకపోతే ఢిల్లీ చీక‌టిలోకి జారుకుంటుంద‌ని రాష్ట్ర మంత్రి హెచ్చరించిన రెండు రోజుల త‌ర్వాత‌.. ఇదే విష‌యంపై సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశంలోని విద్యుత్ ప‌రిస్థితులు క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్నాయ‌ని అన్నారు. ఇప్ప‌టికే అనేక రాష్ట్ర ప్ర‌భుత్వాలు కేంద్రానికి లేఖ‌లు రాశాయ‌నీ, ప‌రిస్థితులు మెరుగుప‌ర్చేందుకు క‌లిసి ముందుకు సాగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు.

కేజ్రీవాల్ తాజాగా మీడియ‌తో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, గుజ‌రాత్‌, పంజాబ్‌, రాజ‌స్థాన్‌, ఢిల్లీ, ఒడిశా, త‌మిళ‌నాడు వంటి రాష్ట్రాల్లో బొగ్గు కొర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విద్యుత్ సంక్షోభాన్ని ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని అన్నారు. బొగ్గు కొర‌త‌.. విద్యుత్ సంక్షోభంపై మీడియాలో వ‌స్తున్న వార్త‌లు, ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌తో, అదేంలేదు.. ఆందోళ‌న వ‌ద్దంటూ కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ సింగ్ పేర్కొన్నారు. అయితే, సోమ‌వారం నాడు బొగ్గు సరఫరా, విద్యుత్ కొరత వంటి సమస్యపై చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖల ఇన్‌చార్జిల‌తో పాటు ఆయా మంత్రుల‌తో స‌మావేశ‌మైన‌ట్టు స‌మాచారం. దీంతో విద్యుత్ సంక్షోభం.. చార్జీలు పెంపు వంటి అంశాలు తీవ్ర చర్చనీయాంశ అంశాలుగా మారాయి.

యూపీలో నిరంకుశ పాల‌న..

జమ్మూకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి

లఖింపూర్ కేసు: కేంద్ర మంత్రి, ఆయ‌న కుమారుడిని కాపాడేందుకు యోగి ప్రయత్నం

మండిపోతున్న పెట్రోల్ ధరలు

ఢిల్లీ గాలి పీల్చుకోనివ్వ‌ట్లేదు !

భారీ వర్షంతో మ‌ళ్లీ నీట‌మునిగిన హైదరాబాద్. వైర‌ల‌వుతోన్న వీడియోలు

ల‌ఖింపూర్‌ హింస: పోలీసుల ముందుకు కేంద్ర మంత్రి కుమారుడు

Share this content:

You May Have Missed