దర్వాజ-జాతీయం
Maharashtra: చలికి తట్టుకోలేకపోతే మీరు ఏం చేస్తారు అంటే.. ఏం చెప్తారు.. ఏముంది నాలుగైదు దుప్పట్లు కప్పుకుంటాం.. లేకపోతే చలి మంటలు వేసుకుని కూర్చుంటాం అని చెప్తారు కదూ. కానీ ఓ వ్యక్తి మాత్రం మామూలుగా నేనెందుకు ఆలోచిస్తా.. అని వెరైటీగా.. సలి సంపేస్తుందని బైక్ కే నిప్పు పెట్టి చలి కాచుకున్నాడు. ఈ వింత ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగింది. ఈ విషయం తెలిసిన స్థానికులు, పోలీసులు ఇదేందిది అంటూ ముక్కున వేలేసుకున్నారు.
అసలు విషయానికొస్తే.. స్థానిక యశోధరానగర్ లో కొంత కాలం నుంచి బైక్ ల దొంగతనాలు జరుగుతున్నాయి. దాంతో బాదితులు పోలీసులను ఆశ్రయించారు. ఇక పోలీసులు రంగంలోకి దిగి నిందితులైనా చోటా సర్ఫరాజ్ ను మరికొంత మందిని అరెస్టు చేశారు. ఈ దొంగలంతా కలిసి దాదాపు 10 టూ వీలర్స్ ను చోరీ చేసినట్టు పోలీసులు వెళ్లడించారు. కాగా వారి నుంచి 9 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంకొక బండి లేదేంటి అని పోలీసులు ఆరా తీయగా.. అందులో ఒక దొంగ చెప్పిన సమాదానం విని పోలీసులు షాక్ కు గురయ్యారు. చలి బాగా వేయడంతో తట్టుకోలేక తనదగ్గరున్న బైక్ కు నిప్పు అంటించి.. చలి కాచుకున్నానని ఆ దొంగ సమాదానమిచ్చాడు. అది విన్న పోలీసులు ఏందీ బైక్ కు మంట పెట్టి చలి కాచుకున్నావా అంటూ ముక్కున వేలేసుకున్నారు.
Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి
Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి
Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం
Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?
Inter First Year Result: వాళ్లందరూ పాస్..
Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?
Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు
Share this content: