Breaking
Tue. Nov 18th, 2025

బైక్ తీసుకుపోయాడని ఎస్సైని ఏం చేశాడంటే.. ?

Traffic cop stabbed
Traffic cop stabbed

ద‌ర్వాజ‌-భోపాల్

Traffic cop stabbed for towing wrongly parked two-wheeler : నో పార్కింగ్ జోన్ లో వాహనాన్ని నిల‌ప‌డం.. అధికారులు వ‌స్తే వారికి ఫైన్ క‌ట్ట‌డ‌మో.. వారిని రెక్వెస్ట్ చేసి అక్క‌డి నుంచి వెల్లిపోవ‌డ‌మో లేదా వారితో వాగ్వాదాలు చేయ‌డ‌మో జ‌రిగేటువంటి ఘ‌ట‌న‌లు నిత్యం క‌నిపిస్తూనే ఉంటాయి. కానీ భోపాల్ ఓ వ్య‌క్తి ఏకంగా ట్రాఫిక్ పోలీసును క‌త్తితో తీవ్రంగా దాడిచేశాడు. వివ‌రాల్లోకెళ్తే.. భోపాల్‌లోని ఎంపీ న‌గ‌ర్ ప్రాంతంలోని జ్యోతి టాకీస్ కు హ‌ర్షామీనా అనే వ్య‌క్తి వెళ్లాడు. స‌మీపంలోని నో పార్కింగ్ జోన్‌లో ద్విచ‌క్ర వాహ‌నం నిలిపాడు.

అయితే, అక్క‌డ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్పై శ్రీరామ్ దుబే.. నో పార్కింగ్ జోన్‌లోని వాహ‌నాల‌ను పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించాడు. అందులో హ‌ర్షామీనా బైక్ కూడా ఉండ‌టంతో స్టేష‌న్‌కు వెళ్లాడు. బండికి సంబంధించిన ప‌త్రాలు, ఫైన్ రూ.600 చెల్లించాడు. వాహ‌నం తీసుకోవ‌డానికి వెళ్తుండ‌గా.. అక్క‌డే ఉన్న ఎస్సై శ్రీరామ్‌పై ఒక్క‌సారిగా హ‌ర్షామీనా క‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడు. పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు అత‌న్ని ప‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఎస్సై ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

Related Post