Loading Now
Akhilesh Yadav

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 400 స్థానాలు గెలుస్తాం..

• నకిలీ బాబా పాలన అంతం కానుంది: అఖిలేష్‌ ధీమా
• రైతులను అణిచివేస్తున్న బీజేపీ.. ప్రజల్లో అసంతృప్తి అంటూ వ్యాఖ్య

ద‌ర్వాజ‌-లక్నో
Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. ఎన్నికల్లో జయకేతనం ఎగురవేడానికి అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో యూపీ రాజకీయాలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) 400 సీట్లలో విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్‌, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యానాధ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిలేష్‌ యాదవ్‌ రాష్ట్రవ్యాప్త ‘విజయ రథ యాత్ర’ను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కాన్పూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. రైతులను అణచివేస్తున్న బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తి నెలకొన్నదని పేర్కొన్నారు. రాష్ట్రలో బీజేపీ సర్కారను గద్దె దించడమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు సాగుతున్నదని వెల్లడిరచారు. లఖింపూర్‌ ఖేరీ ఘటనను ప్రస్తావిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

బీజేపీ రైతులను అణచివేస్తున్నదని పేర్కొన్నారు. ఆ పార్టీకి చెందిన వ్యక్తులు అన్నదాలతను వాహనాలతో తొక్కించి చంపేస్తున్నారని ఆరోపించారు. బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ విమర్శించారు. ఎరువుల ధరలను పెంచి రైతులను పీడిస్తున్న నకిలీ బాబా పతనం తప్పదని యోగిని ఉద్దేశించి అఖిలేష్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూపీలో నిరుద్యోగం, ధరల మంట, శాంతిభద్రతలు క్షీణించడం బీజేపీ సర్కార్‌ వైఫల్యమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లఖింపూర్‌ ఖేరీ ఘటనలో రైతులకు న్యాయం చేయాలన్నారు. కాగా, యూపీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 400కు పైగా అసెంబ్లీ స్థానాలున్నాయి.

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

జీమెయిల్ సేవ‌ల‌కు అంత‌రాయం

బాల్య వివాహాలు.. ఏటా 22 వేల మంది బాలిక‌లు బలి

2-18 వ‌య‌స్సుల వారికి క‌రోనా వ్యాక్సిన్‌

ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాది అరెస్ట్‌

ఈటల రాజేందర్‌పై కేసు నమోదు

క్లిష్ట పరిస్థితుల్లో.. విద్యుత్‌ సంక్షోభం.. : కేజ్రీవాల్‌

యూపీలో నిరంకుశ పాల‌న..

Share this content:

You May Have Missed