దర్వాజ-న్యూఢిల్లీ
ప్రధాని మోడీ పుట్టిన రోజు (సెస్టెంబర్ 17)న జాతీయ నిరుద్యోగ దినోత్సవంగా జరపాలని ఇండియన్ యూత్ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆ రోజున దేశవ్యాప్తంగా భారత యువజన కాంగ్రెస్ వివిధ కార్యక్రమాలను, నిరసనోద్యమాలను నిర్వహించనుంది. ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ.శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ “దేశంలోని యువత ఈ రోజు వీధుల్లో నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని పెద్ద వాగ్దానాలు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం ఉపాధి సమస్యపై పూర్తిగా మౌనంగా ఉంది” అని అన్నారు.
అలాగే, దేశంలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే.. ప్రభుత్వం మాత్రం తన తప్పుడు ప్రచారంతో తన బ్రాండ్ంగ్ నిలుపుకోవడంతో బిజీగా ఉంది అంటూ ఆరోపించారు. దేశంలో నిరుద్యోగ రేటు ఏడాది కాలంలో 2.4 శాతం నుంచి 10.3 శాతానికి పెరిగిందని ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, #NationalUnemploymentDay హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
గుజారత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక క్రైమ్ రేటు
తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు
గుంటూరులో విద్యార్థిని దారుణ హత్య
ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల రాక్షస పాలన.. షరియా చట్టం