Breaking
Tue. Nov 18th, 2025

NIA Raids: నేతల అరెస్టుకు నిరసనగా శుక్రవారం కేరళ బంద్‌కు పీఎఫ్‌ఐ పిలుపు

PFI , Kerala bandh, protest , arrest, NIA , Central forces , పీఎఫ్ఐ, కేరళ బంద్, నిరసన, అరెస్టు, ఎన్ఐఏ, కేంద్ర బలగాలు,

ద‌ర్వాజ‌-తిరువ‌నంత‌పురం

PFI-Kerala bandh: తమ అగ్రనేతలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఎన్‌ఐఏ అధికారుల సంయుక్త బృందం గురువారం తెల్లవారుజామున అరెస్టు చేసిన తీరుకు నిరసనగా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కేరళ యూనిట్ శుక్ర‌వారం నాడు కేర‌ళ బంద్ కు పిలుపునిచ్చింది. కాగా, దేశ‌వ్య‌ప్తంగా ద‌ర్యాప్తు సంస్థ‌లు గురువారం నాడు పీఎఫ్ఐ, సంబంధికుల కార్యాల‌యాల‌పై దాడులు నిర్వ‌హించింది. ఈ క్ర‌మంలోనే ప‌లువురిని అదుపులోకి తీసుకున్నాయి. దాదాపు 22 మంది అగ్రనేతలను అదుపులోకి తీసుకున్న తర్వాత PFI ప్రధాన కార్యదర్శి, అబ్దుల్ సతార్, ఇతర నాయకులు కేర‌ళ బంద్‌కు పిలుపునిచ్చారు. వారిలో ఛైర్మన్ OMA సలాం, నసరుద్దీన్ ఎలమారం, పీ. కోయా త‌దిత‌రులు ఉన్నారు.

కాగా, బంద్ నుంచి ప్రాథమిక-అత్య‌వ‌స‌రమైన సేవలు మినహాయించబడ్డాయి. కేంద్ర బలగాల సహాయంతో దాడులు నిర్వహించామనీ, కేరళ పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించామనీ, అయితే అసలు లక్ష్యం ఏమిటో చెప్పలేదని, అవసరమైతే కొన్ని బెటాలియన్ల బలగాలు సిద్ధంగా ఉండాలని కోరినట్లు సమాచారం. అరెస్టయిన వారిలో కొందరిని ఇప్పటికే ఢిల్లీకి తీసుకెళ్లగా, దాదాపు డజను మందిని కొచ్చిలోని ఎన్‌ఐఏ కోర్టు ముందు ఆ రోజు హాజరుపరచనున్నారు.

“ఇది ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘించడం. ఆర్‌ఎస్‌ఎస్ పాటలకు నృత్యం చేయడం తప్ప మరొకటి కాదు, కేంద్ర ఏజెన్సీలు మన నాయకులను చాలా మందిని అదుపులోకి తీసుకున్నాయి. ప్రజాస్వామ్య ప్రేమికులందరూ దీనిని వ్యతిరేకిస్తారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. దీనికి నిరసనగా, శుక్రవారం సాయంత్రం వ‌ర‌కు కేరళ బంద్ ను పాటించాలని మేము రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజామున పిలుపునిచ్చాము”అని సతార్ చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరును ఖండిస్తున్నట్టు పీఎఫ్ఐ ఒక ప్రకటనలో తెలిపింది.

Related Post