దర్వాజ-నిర్మల్
Young man dies of heart attack while dancing: డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక యువకుడు కుప్పకూలిపోయాడు. భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలం పర్ది(కే) గ్రామంలో శనివారం రిసెప్షన్ లో డ్యాన్స్ చేస్తుండగా ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం(19).. పర్ది (కే) గ్రామంలో జరిగిన రిసెప్షన్ పార్టీలో తెలుగు సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ రాత్రి 7 గంటల సమయంలో కుప్పకూలిపోయాడు. వెంటనే భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ముత్యం శుక్రవారం భైంసా మండలం కామోల్ గ్రామంలో స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు వచ్చాడని బంధువులు తెలిపారు.