Breaking
Tue. Nov 18th, 2025

ఢిల్లీలో సోనియా గాంధీని కలవనున్న నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాద‌వ్

Sonia Gandhi, Meet, Nitish Kumar, Lalu Prasad Yadav, Opposition , Delhi, సోనియా గాంధీ, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, ప్రతిపక్షాలు, ఢిల్లీ, భేటీ,

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Opposition Meet: 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి మొత్తం ప్రతిపక్షాలను ఏకం చేయడానికి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్.. ఆదివారం నాడు దేశ రాజధానిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవనున్నారు. ముగ్గురు నేతల ప్రత్యేక భేటీ అయిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) వ్యవస్థాపకుడు దివంగత చౌదరి దేవి లాల్ జయంతి సందర్భంగా ఐఎన్‌ఎల్‌డి నేత ఒపి చౌతాలా ఆదివారం ఫతేహాబాద్ జిల్లాలో జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు ఇద్దరు నేతలు ఢిల్లీకి చేరుకోనున్నారు.

“నితీష్ కుమార్, నేను సోనియా గాంధీని కలుస్తాం. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం” అని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ ఢిల్లీకి చేరిన త‌ర్వాత చెప్పారు.

Related Post