దర్వాజ-అమరావతి
NTR Health University Row: టాలీవుడ్ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి బాలకృష్ణకు వైఎస్సార్సీపీ నేత, మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ ఒక సినిమాలో చెప్పిన పాపులర్ డైలాగ్.. ఆయనపైనే విమర్శల దాడి చేశారు. బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జగన్ అన్న ముందు కాదుని పేనర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జగన్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ”గన్” అనే రియల్ సింహం 🦁
తేడా వస్తే దబిడి దిబిడే..!! అంటూ మంత్రి రోజా ట్వీట్ చేశారు.
బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జగన్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ”గన్” అనే రియల్ సింహం 🦁
— Roja Selvamani (@RojaSelvamaniRK) September 24, 2022
తేడా వస్తే దబిడి దిబిడే..!!
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై పార్టీ నేతలే కాకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ పేరును మెడికల్ యూనివర్సిటీగా మారుస్తూ అసెంబ్లీ బిల్లును ఆమోదించడంపై ఎన్టీఆర్ వారసులు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.