Breaking
Wed. Nov 19th, 2025

cyclone: పొంచివున్న తుఫాను ముప్పు.. డ్రై ఫుడ్, సైక్లోన్ షెల్టర్‌లను సిద్ధం చేస్తున్న బీఎంసీ.. !

Cloudy sky, Hyderabad, IMD, Rainfall, Telangana, మేఘావృతమైన ఆకాశం, హైదరాబాద్, ఐఎండీ, వర్షపాతం, తెలంగాణ,Karnataka , క‌ర్ణాట‌క‌,

దర్వాజ-భువ‌నేశ్వ‌ర్‌
BMC keeps dry food, cyclone shelters ready: ఈ వారంలో తుఫాను వచ్చే అవకాశం ఉన్నందున భువ‌నేశ్వ‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (BMC) 72 తాత్కాలిక షెల్టర్లను సిద్ధం చేసి ఉంచింది. అలాగే, తుఫాను కార‌ణంగా నిలిచిపోయిన మురికినీటిని పారద్రోలేందుకు 15 నీటి పంపులను ఏర్పాటు చేయనున్నట్లు BMC అధికారులు తెలిపారు. రోడ్లు, కాలువలు క్లియర్ చేయడానికి మూడు ఎక్స్‌కవేటర్‌లను సిద్ధంగా ఉంచారు.

“అత్యవసర ప్ర‌జ‌ల తరలింపు కోసం మేము నగరంలోని మూడు జోన్లలో కళ్యాణ మండపాలను సిద్ధంగా ఉంచాము. అలాగే, డ్రైఫుడ్‌, (ఆహారం) కూడా నిల్వ చేసాము” అని BMC డిప్యూటీ కమిషనర్ రమేష్ జెనా చెప్పారు. ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని కధనంతో సహా 70 స్థానాల‌పై పౌర అధికారులు నిఘా ఉంచుతారు. అంతేకాకుండా, లక్ష్మీసాగర్ , ఆచార్య విహార్, జయదేవ్ విహార్, వివేకానంద మార్గ్ , ఓల్డ్ టౌన్ మరియు ఇతర ప్రాంతాలు కూడా వారి నిఘాలో ఉంటాయి.

Related Post