దర్వాజ-హైదరాబాద్
Padma Shri tulsi gowda: అడవే ఆమెకు అమ్మ. ఆ చెట్లే ఆమెకు నేస్తాలు. ఆ మొక్కలే ఆమెతో ఊసులాడే స్నేహితురాళ్లు. బాధైనా, సుఖమైనా, ఆనందమైనా అన్నింటికి ఆ వనమే ఆమెకు ఇల్లు. ఆ వనం కన్న బిడ్డలాగా ఎప్పుడూ అడవి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. పచ్చదనాన్ని పదితరాలకు పెంచుకుంటూ అడవికే ‘తులసి’ కోటలా నిలిచి ప్రకృతితో మమేకమైపోయింది ఆ తల్లి. వయసు 76 ఏండ్లు.. అయినా ఆమె ఏనాడు నేను ఈ పని చేయలేనంటూ వెనకడుగు వేయలేదు.
ఎన్నో భాదలు, మరెన్నో కష్టాలు అయినా వెనకడుగు వేయలేదు. నా సంతోషం ఎక్కడో లేదంటూ అడవితల్లి ఒడిలోనే సేదతీరుతూ.. ఒక వన సామ్రాజ్యాన్ని నిర్మించి.. దానికి మహారాణిలా వెలుగొందుతోంది ఆ తల్లి. పైగా నా తల్లిని నేను చూసుకోకుంటే ఏట్లా అని పచ్చదనాన్ని పది కాలాల పాటు నిలబెట్టేందుకు అలుపెరుగకుండా ప్రయత్నిస్తూనే ఉంది. రాణులు కోటలు కడితే.. ఈ తల్లి మాత్రం లోకానికి మేలు చేసే ఓ ప్రత్యేకమైన కోటనే నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె కర్ణాటకు చెందిన తులసి గౌడ. అలుపెరుగకుండా ఏకంగా 40 వేల వృక్షాలను పెంచి ఒక వన సామ్రాజ్యాన్ని నిర్మించి దానికి రాణిలా మారింది.
6 దశాబ్దాలుగా ఆమె పర్యావరణానికి చేస్తున్న సేవే గౌరవప్రదమైన పద్మశ్రీ అవార్డును అందుకునేలా చేసింది. ఎలాంటి హంగులు ఆర్బాటాలు లేకుండా సాంప్రదాయమైన దుస్తుల్లో కాళ్లకు చెప్పులు లేకుండా అలా అవార్డును అందుకోవడానికి వస్తుంటే.. ఆమెను చూసిన కళ్లు ఆనందం, ఆశ్చర్యంతో దర్భార్ హాల్లోని అందరూ ఆమె వైపే అలా చూస్తుండి పోయారు. ఆ తల్లిని చూసి ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆమెకు గౌరవంగా నమస్కారం చేశారు.
తులసి గౌడ పుట్టి పెరిగింది కర్ణాటకలోని అంకోలాలోని హొన్నాలి గ్రామంలో. ఆమె ఓ బీద గిరిజన కుటుంబంలో జన్మించారు. తన చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తులసి కూలికి వెల్లేది. ఆర్థిక ఇబ్బందులతో తులసి చదువుకోలేదు. అయితే తులసికి 10-12 మధ్య ఏండ్ల వయస్సులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. కానీ పెళ్లైన కొన్నేండ్లకే తులసి భర్త చనిపోయాడు. దాంతో ఆమె జీవితంలో చీకట్లు ఆవరించేశాయని ఎల్లప్పుడూ బాధపడేది. ఆ బాధనుంచి తులసి బయటపడేందుకు ఎప్పుడూ దగ్గర్లో ఉన్న అడవికి వెళ్తుండేది.
ఆ చెట్లే ఆమెకు ఓదార్పునివి. ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచేవి. అలా అలా ఆ చెట్లే ఆమెకు ఆత్మీయులు అయ్యాయి. చెట్లకు ఆమెకు విడదీయరాని బంధం ఏర్పడింది. తులసి చిన్నప్పటి నుంచి మొక్కలు నాటుతూ.. వాటిని సంరక్షిస్తూ ఉండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు తులసిని తాత్కాలిక ఉద్యోగినిగా నియమించారు. ఆమె నైపుణ్యతను చూసి కొన్నేళ్లకే ఆమె శాశ్వత ఉద్యోగినిగా నియమింపబడింది. సుమారుగా తులసి 14 ఏండ్ల పాటు అటవీ శాఖలో పని చేసి విరమణ పొందారు. విరమణ పొందినా తులసి మాత్రం చెట్ల పెంపకాన్ని ఏనాడు ఆపలేదు.
శాస్త్రవేత్తలకు సైతం తెలియని మొక్కల గురించి విషయాలను ఆమె సునాయాసంగా చెప్పేయగలదు. ఏ చెట్టు ఎన్ని రోజులు బ్రతుకుతుంది, దాని ఔషద గుణాలేంటన్న విషయాలు మొక్కలను చూసి చెప్పేయగల నైపుణ్యం గలదు. అందుకే కాబోలు శాస్త్రవేత్తలు ఆ వనదేవతకు ‘ఎన్ సైక్లోపిడియా ఆఫ్ ఫారెస్ట్’ అని పిలిచేవారు. తనకొచ్చే పింఛను పైసలను కూడా తను బిడ్డలాగా సాకే మొక్కల పెంపకానికే పెడుతుందంటే ఆ తల్లి మనస్సు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. వీలైతే చెట్లను నరికేస్తాం.. కానీ పెట్టడం మా వల్ల కాదు అనే వారికి ఈ తులసి తల్లిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆమె సేవ స్ఫూర్తిదాయకం.
పిల్లల్ని కనడంపై ఉపాసన సమాధానం ఇదే..
Kangana Ranaut: ‘1947లో భిక్షం.. 2014లోనే దేశానికి స్వాతంత్య్రం’ : కంగనా రనౌత్
3 Roses: నేను నీ కంటే చాలా పెద్దదాన్ని : పూర్ణ
బాబోయ్ బాలయ్య ఏంటా ఎనర్జీ.. అన్ స్టాబబుల్ స్టేజిపై బాలయ్య అదిరిపోయే స్టెప్పులు
Jai Bhim: సినతల్లికి మంచి ఇల్లు కట్టిస్తా; లారెన్స్
Assam Road Accident : త్రిపురలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
T20 World Cup 2021: ఫైనల్‌కు న్యూజిలాండ్
Share this content: