Breaking
Sat. Jun 28th, 2025

Parliament Session: పార్లమెంట్ సమావేశాల్లో పొలిటిక‌ల్ వార్.. అస్త్రాలు సిద్ధంచేసిన అధికార‌, ప్ర‌తిప‌క్షాలు !

MoParliament nsoon Session, Centre, 24 Bills, Opposition, inflation, Agnipath, Parliament, unemployment, Parliament Session, central government, Cantonment Bill, Multi-State Cooperative Societies Bill, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, 24 బిల్లులు, ప్రతిపక్షం, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్, పార్లమెంట్, నిరుద్యోగం, పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర ప్రభుత్వం, కంటోన్మెంట్ బిల్లు,Telugu News, ద‌ర్వాజ‌, darvaaja, Telugu News updates, తెలుగు న్యూస్‌, తాజా వార్త‌లు,

దర్వాజ-న్యూఢిల్లీ

Parliament Monsoon Session: సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్న పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో పొలిటిక‌ల్ వార్ ఖాయంగా క‌నిపిస్తోంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇప్ప‌టికే పార్ల‌మెంట్ స‌మావేశాల వ్యూహాల గురించి చ‌ర్చించ‌డానికి భేటీ అయ్యాయి. కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు ప‌లు బిల్లుల‌ను తీసుకురావ‌డానికి సిద్ధ‌మవుతుండగా.. ప్ర‌తిప‌క్ష పార్టీలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్ పథకం, రూపాయ ప‌త‌నం వంటి అంశాలను లేవనెత్తడానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ సారి జ‌రిగే పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌త్యేకంగా ఉండ‌నున్నాయి.

రాష్ట్రప‌తి ఎన్నిక‌లు

ప్ర‌స్తుత పార్ల‌మెంట్ సెషన్‌లో రాష్ట్రపతి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అలాగే, ఉప‌రాష్ట్రప‌తిని కూడా ఎన్నుకోనున్నారు. సెషన్‌లో మొదటి రోజు పార్లమెంట్‌లోని పోలింగ్ బూత్‌లలో ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికలకు ఓటు వేస్తారు. జూలై 21న ఓట్ల లెక్కింపు, జూలై 25న తదుపరి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థులుగా ద్రౌప‌ది ముర్ము, య‌శ్వంత్ సిన్హాలు బ‌రిలో ఉన్నారు.

అధికార, ప్ర‌తిప‌క్షాల ప్ర‌త్యేక స‌మావేశాలు

వ‌ర్షాకాల పార్ల‌మెంట్ సమావేశాల నేప‌థ్యంలో అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇప్ప‌టికే ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించాయి. పార్ల‌మెంట్ లో కొన‌సాగించాల్సిన వ్యూహాల‌పై చ‌ర్చించాయి. స‌మావేశాలు సజావుగా సాగాలని కోరుతూ బీజేపీ ఆదివారం నాడు పార్లమెంటు అనెక్స్ భవనంలో సమావేశానికి పిలిచింది. దీనికి పీఎం మోడీ, హోంమంత్రి అమిత్‌షా కూడా హాజ‌రుకానున్నార‌ని తెలిసింది. రానున్న వర్షాకాల సమావేశాల వ్యూహాలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ఆదివారం సమావేశం కానున్నాయ‌ని స‌మాచారం. కేంద్ర ప్రభుత్వంపై సంధించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించనున్నారు.

అధిక ద్ర‌వోల్బ‌ణం, అగ్నిప‌థ్, నిరుద్యోగం, చ‌మురు ధర‌ల‌ను వేవ‌నెత్త‌నున్న ప్ర‌తిప‌క్షం

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టేందుకు అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, అగ్నిపథ్, నిరుద్యోగం, రూపాయి పతనం వంటి అంశాలను లేవ‌నెత్త‌డానికి కాంగ్రెస్ సిద్ధ‌మైంది. దీంతో పాటు ఎల్‌పీజీ సిలిండర్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌, స‌రిహ‌ద్దులో ఉద్రిక్తతలు, కేంద్ర సంస్థ‌లను దుర్వినియోగం చేయ‌డం, వంటి అంశాలు ఉన్నాయి.

24 బిల్లులను జాబితా చేసిన కేంద్రం

పార్ల‌మెంట్ స‌మావేశాల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం 24 బిల్లుల‌ను జాబితా చేసిన‌ట్టు స‌మాచారం. కంటోన్మెంట్ బిల్లు, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లుతో సహా 24 బిల్లులు ఉన్నాయి. ఆ విల్లుల్లో ది కాఫీ (ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్) బిల్లు, ఎంటర్‌ప్రైజెస్ అండ్ సర్వీసెస్ హబ్‌ల అభివృద్ధి బిల్లు, the Competition (Amendment) Bill, Multi-State Cooperative Societies (Amendment) Bill వంటివి ఉన్నాయి.

Related Post