Loading Now
petrol

లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.118.23

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

petrol and diesel prices : భార‌త్‌లో చ‌మురు ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. గ‌త కొన్ని రోజులుగా నిత్యం చ‌మురు ధ‌ర‌ల‌ను పెంచుతున్న ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు గురువారం కూడా మ‌రోసారి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచాయి. దీంతో పెట్రోల్ గరిష్ట ధ‌ర రూ.118.23కు చేరింది. డీజిల్ ధ‌ర రూ.109.4కు పెరిగింది. వివ‌రాళ్లోకెళ్తే.. తాజాగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు లీట‌రుపై 35 పైస‌ల చొప్పున పెంచాయి. దీంతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధ‌ర రూ.106.54కు చేర‌గా, లీట‌రు డీజిల్ ధ‌ర రూ.95.27కు పెరిగింది.

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలోనూ చమురు ధ‌ర‌లు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ప్ర‌స్తుతం లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.112.44, డీజిల్‌ రూ.103.26 చేరింది. అలాగే, చెన్నైలో పెట్రోల్‌ రూ.103.61, డీజిల్‌ రూ.99.59కి, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.107.12, డీజిల్‌ రూ.98.38కి చేరాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా పెరిగాయి. హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.110.82కు, డీజిల్ ధ‌ర లీట‌రుకు రూ.103.94కు పెరిగింది. రాజ‌స్థాన్ లోని గంగాన‌గ‌ర్ లో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.118.23, డీజిల్ ధ‌ర రూ.109.04కు పెరిగింది.

ఇప్ప‌టికే అక్టోబ‌ర్ నెల‌లో 16 సార్లు పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు తాజాగా పెంపుతో వాహ‌న‌దారులు ల‌బోదిబోమంటున్నారు. చ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌పై కూడా ప్ర‌భావం చూపుతోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు సైతం ఇటీవ‌ల భారీగా పెరిగాయి. దీంతో వాహ‌న‌దారుల‌తో పాటు స‌మాన్యుల‌పైనా ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల ప్ర‌భావం ప‌డుతోంద‌ని మార్కెట్ వ‌ర్గాలు పెర్కొంటున్నాయి.

ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు

ప్ర‌శ్నించినందుకు దాడిచేసిన ఎమ్మెల్యే.. వీడియో వైర‌ల్

ఉత్త‌రాఖండ్‌పై ప్ర‌కృతి ప్ర‌కోపం.. 47కు పెరిగిన మృతులు

తెలంగాణ ద‌ళితబంధుకు ఈసీ బ్రేకులు

డేరా బాబాకు జీవిత ఖైదు

కేరళలో భారీ వర్షాలు.. 25 మంది మృతి

జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల టార్గెట్..

రైతుల రైల్ రోకో

Share this content:

You May Have Missed