భారీ వర్షం హెచ్చరికలు: ప్రధాని మోడీ షాడోల్ పర్యటన వాయిదా

Defence sector, exports, NarendraModi, India, రక్షణ రంగ సంస్కరణలు, ఎగుమతులు, రాజ్ నాథ్ సింగ్,నరేంద్ర మోడీ, భారతదేశం,

దర్వాజ-భోపాల్

PM Modi’s Madhya Pradesh Visit: ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ లోని షాడోల్ జిల్లా పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రధాని షాడోల్ జిల్లాలోని లాల్పూర్, పకారియా పర్యటనను వాయిదా వేసినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం (జూన్ 27) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, షాడోల్ జిల్లాలోని లాల్పూర్, పకారియాలో జరగాల్సిన ప్రధాని మోడీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సీఎం చౌహాన్ సోమవారం తెలిపినట్టు ఏఎన్ఐ నివేదించింది.

ఈ కార్యక్రమాన్ని రద్దు చేయలేదని, త్వరలోనే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయన పర్యటన కొత్త తేదీని నిర్ణయిస్తామన్నారు. లాల్ పూర్ లో కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతాయి. భోపాల్ లో ప్రధాని మోడీ కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయన్నారు.షెడ్యూల్ ప్రకారం, ప్రధాని మోడీ మంగళవారం రాష్ట్ర రాజధానిలో రెండు వందే భారత్ రైళ్లను (భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్) ప్రారంభించడానికి రాష్ట్రానికి రావాల్సి ఉంది.

ఉదయం 10 గంటలకు నగరానికి చేరుకోనున్న ప్రధాని మోడీ 11 గంటలకు నగరంలోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. ఆ తర్వాత నగరంలోని లాల్ పరేడ్ మైదానంలో జరిగే పార్టీ స్థాయి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనాల్సి ఉండగా, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాయిదా వేశారు. సీఎం చౌహాన్ సోమవారం లాల్ పరేడ్ మైదానానికి చేరుకుని ప్రధాని కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు.

మరోవైపు ప్రధాని మోడీ భద్రత కోసం పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మార్గాన్ని దారి మళ్లించారు. నగరంలో భద్రత కోసం 3000 వేల మంది పోలీసులు, 50 మందికి పైగా ఉన్నతాధికారులను మోహరించారు. పర్యవేక్షణ కోసం డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు.

Related Post