దర్వాజ-అంతర్జాతీయం
Pregnant woman gang-raped: భర్తను కట్టేసి నిండు గర్భిణి పై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. డైలీ పాకిస్తాన్ నివేదించిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని జీలం నగరంలో ఓ గర్భిణిపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. నిందితులు మొదటగా ఇంట్లోకి ప్రవేశించి గర్భిణి భర్తను కట్టేశారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశారు. దాడి అనంతరం అనారోగ్యానికి గురైన మహిళ ఆస్పత్రికి వెళ్లింది. బాధితురాలు తనకు జరిగిన బాధను వివరించడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం లాహోర్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసును విచారించేందుకు పంజాబ్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పంజాబ్ ఐజీపీ సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరింది. గత నెలలో కరాచీలో కదులుతున్న రైలులో 25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన మరోసారి దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. ఫి
Share this content: