దర్వాజ-న్యూఢిల్లీ
Presidential Elections 2022: రామ్ నాథ్ కోవింద్ తర్వాత భారత రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సోమవారం పోలింగ్ జరుగుతోంది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు రాష్ట్రపతి ఎన్నికలు-2022కి ఓటు వేశారు. పార్లమెంట్ లోపల ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌కు ప్రధాని వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల మధ్య ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ప్రాధాన్య నెలకొంది.
#WATCH Prime Minister Narendra Modi votes to elect new President, in Delhi#PresidentialElection pic.twitter.com/pm9fstL46T
— ANI (@ANI) July 18, 2022
ఓటింగ్ కు ముందు ప్రధాని నరేంద్ర మోడీ.. “ఈ సెషన్ కూడా ముఖ్యమైనది ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రపతి & ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు (రాష్ట్రపతి ఎన్నికలకు) ఓటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దేశానికి మార్గనిర్దేశం చేయడం ప్రారంభిస్తారు” అని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, అశోక్ గెహ్లాట్, శివరాజ్ సింగ్ చౌహాన్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంకే స్టాలిన్ సహా పలువురు సీఎంలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH Tamil Nadu CM MK Stalin casts vote in 16th Presidential election, in Chennai pic.twitter.com/fmFb9sdw49
— ANI (@ANI) July 18, 2022
జూలై 21న ఓట్ల లెక్కింపు, జూలై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Share this content: