దర్వాజ-న్యూఢిల్లీ
Prophet remark row: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీద్ర దుమారం రేపుతున్నాయి. గల్ప్ దేశాలు భారత్ పై ఘాటుగానే స్పందిస్తున్నాయి. నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి స్పందిస్తూ.. బీజేపీ నాయకులతో పాటు కేంద్రం ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. బీజేపీ సిగ్గుమాలిన మతోన్మాదం భారతదేశాన్ని ఏకాకిని చేయడమే కాకుండా, దాని ప్రపంచ స్థాయిని కూడా దెబ్బతీసిందంటూ ఘాటుగా స్పందించారు. ‘అంతర్గతంగా విడిపోయిన భారత్ బాహ్యంగా బలహీనంగా మారుతోంది. బీజేపీ అవమానకరమైన మతోన్మాదం మనల్ని ఒంటరిగా చేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రతిష్టను దెబ్బతీసింది’ అని రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Divided internally, India becomes weak externally.
— Rahul Gandhi (@RahulGandhi) June 6, 2022
BJP’s shameful bigotry has not only isolated us, but also damaged India’s standing globally.
ఇస్లాం స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అరబ్ ప్రపంచం ఖండిస్తున్న రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్, యూఏఈ, ఇరాన్ వంటి గల్ఫ్ దేశాలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి. ఖతార్, కువైట్ భారతదేశం నుండి బహిరంగ క్షమాపణలు కోరుతున్నాయని చెప్పారు.
కాగా, మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్ చేసిన ఇద్దరు బీజేపీ నేతలు నిపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ ను బీజేపీ సస్పెండ్ చేసింది.
Share this content: