Breaking
Tue. Nov 18th, 2025

ఇద్ద‌రు గర్భిణులు స‌హా ఐదుగురి దారుణ‌ హ‌త్య..

crime, murder,Bodies, pregnant women, children, Rajasthan, Dudu town, Jaipur district, murder, dowry, మృతదేహాలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, రాజస్థాన్, డుడు పట్టణం, జైపూర్ జిల్లా, హత్య, వ‌ర‌కట్నం,

దర్వాజ-న్యూఢిల్లీ

Jaipur : రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా డూడు పట్టణంలోని ఓ బావిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. తోబుట్టువులయిన ముగ్గురు మహిళలను అత్తమామలు కట్నం డిమాండ్‌తో హత్య చేసి ఉంటారనే అనుమానాలు స్థానికుల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని ఇండియా టూ డే నివేదించింది.

వివ‌రాల్లోకెళ్తే.. జైపూర్ జిల్లా డూడూ పట్టణంలోని ఓ బావిలో శనివారం ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. హత్యకు గురైన మహిళలను తోబుట్టువులైన కలు దేవి, మమత, కమలేష్‌గా గుర్తించారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు నాలుగు సంవత్సరాల వయస్సువారు కాగా, మరొకరు కేవలం 27 రోజులు చిన్నారి ఉన్నారు. మమతా దేవి, కమలేష్ ఇద్దరూ నిండు గర్భిణులు కావడమే ఈ దారుణ నేర తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. వారి మృతదేహాలు లభించిన బావి వారి ఇండ్ల‌కు కేవ‌లం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వరకట్నం డిమాండ్‌తో అత్తమామలు వారిని హత్య చేశారనే ఆరోప‌ణ‌లు స్థానికుల నుంచి వ‌స్తున్నాయి. ఐదుగురు బుధవారం అదృశ్య‌మయ్యారు. ఈ క్ర‌మంలోనే శ‌నివారం నాడు బావిలో శ‌వాలైన తేలారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. విచార‌ణ ప్రారంభించారు.

Related Post