Breaking
Mon. Jun 30th, 2025

స్థానిక భాషలను గౌరవించండి: ఇండిగో విమాన ఘటనపై మంత్రి కేటీఆర్

local languages, KTR , IndiGo , Telangana , KT Rama Rao, flight , Twitter, స్థానిక భాషలు, కేటీఆర్, ఇండిగో, తెలంగాణ, కేటీ రామారావు, ఫ్లైట్, ట్విట్టర్,

దర్వాజ-హైదరాబాద్

KTR: ఏపీలోని విజ‌య‌వాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ మహిళకు హిందీ లేదా ఇంగ్లీషు మాట్లాడటం రాద‌నే కార‌ణంతో వేరే సీటు మార్చారు. భాష పేరుతో జరిగిన ఈ వివ‌క్ష‌ను గురించి విమానంలోని మ‌రో ప్ర‌యాణికురాలు సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు ఇది దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇలాంటి వివ‌క్ష‌ను ఖండిస్తూ.. ఇండిగో విమ‌న సంస్థ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మంత్రి కేటీఆర్ సైతం స్పందిస్తూ.. ఇండిగో తీరును ఖండించారు.

మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్ లో స్థానిక భాష‌ల‌ను గౌర‌వించాల‌ని సూచించారు. అలాగే, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడ‌లేని ప్ర‌యాణికుల‌పై ఇలా వివ‌క్ష‌ను చూప‌కుంగా గౌర‌వించాలని పేర్కొన్నారు. స్థానిక భాష‌లు తెలిసిన మ‌రింత మంది సిబ్బందిని నియ‌మించుకోవాలంటూ ఇండిగోకు సూచిస్తూ.. త‌న ట్వీట్ ను స‌ద‌రు కంపెనీకి ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. అనేక మంది నెటిజ‌న్లు ఇండిగో విమ‌న సంస్థ తీరును ఖండిస్తూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అస‌లు ఏం జ‌రిగిందంటే.. ?

సెప్టెంబరు 16న విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే 6E 7297 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక తెలుగు మ‌హిళ హైద‌రాబాద్ కు వ‌స్తున్న క్ర‌మంలో ఫ్లైట్ లో ఆమెకు హిందీ, ఇంగ్లీష్ రాద‌నే కార‌ణంతో ఆమె సీటును మార్చారు. భాష పేరుతో ఇలా వివ‌క్ష చూప‌డం ఏంట‌ని తొటి ప్ర‌యాణికురాలు ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. హిందీ, ఇంగ్లీష్ రాక‌పోవ‌డంతో సొంత రాష్ట్రంలోనే రెండో శ్రేణి పౌరులుగా ప‌రిగ‌ణించ‌బ‌డుతున్న వివ‌క్ష‌ను ఎత్తిచూపారు.

Related Post