దర్వాజ-రాజన్న సిరిసిల్లా జిల్లా
భారతదేశంలో 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలందరికీ ఉచ్చిత నిర్బంధ విద్యను అందించడానికి ఉద్దేశించిన చట్టమే( Right to free and compulsory education Act 2009) ఈ విద్యా హక్కు చట్టం 2009 ఆగస్టు 28న రాష్ట్రపతి ఆమోదం పొందింది, కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 26న ఈ బిల్లును ఆమోదించింది.
భారతదేశంలో 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. విద్యా హక్కు చట్టం 1 ఎప్రిల్ 2010 సంవత్సరంలో భారతదేశంలో అమలులోకి వచ్చింది. ఈ విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెబుతుంది.
విద్యాహక్కు చట్టం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయలేక పోతున్నాయి, దీనికి ప్రధాన కారణం అధికారుల లోపం? లేకపోతే ప్రైవేటు పాఠశాల లోపమా? విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు గల బాల బాలికలందరికీ విద్య ప్రాథమిక హక్కు, ప్రాథమిక పాఠశాలలు కనీస ప్రమాణాలు పాటించవలసి ఉంటుంది, కానీ ఎక్కడా ఇవి అమలు కావడం లేదు, అన్ని ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేటు పాఠశాలలో పేద కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది కానీ ఇది ఎక్కడ ఏ ప్రైవేట్ పాఠశాలలో కనిపించడం లేదు. పాఠశాలలో అడ్మిషన్ల కోసం డొనేషన్ల క్యాపిటేషన్ ఫీజులు ఫీజులు వసూలు చేయడం మరియు పిల్లలు తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడం విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధం అవుతుంది, డ్రాపౌట్ స్టూడెంట్ లను వారి సమాన తరగతి విద్యార్థుల స్థాయికి తెచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
బడి వయసు పిల్లలందరినీ బడిలో తమ వయసుకు తగిన తరగతుల్లో చూడాలి. ఆవాస ప్రాంతానికి 1కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండాలి, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి. ఈ విద్యకు అయ్యే ఖర్చు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి, ఏ విద్యార్థిని కూడా ఒక విద్యా సంవత్సరంలో ఏ తరగతిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ నిలిపి ఉంచకూడదు.. ఇది విద్యా హక్కు చట్టానికి విరుద్ధం, ప్రభుత్వ గుర్తింపు లేకుండా బడులు నిర్వహించే కూడదు, ప్రతి పాఠశాలలో యాజమాన్య కమిటీలు sms లను ఏర్పాటు చేయాలి , అదే విధంగా పాఠశాలలు అభివృద్ధి ప్రణాళికను తయారు చేయాలి, ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించ కూడదు, విద్యావిధానం ఆధునిక ధోరణులు లో మార్పులు సలహాలకు జాతీయ స్థాయిలో జాతీయ సలహా సంఘం,రాష్ట్రంలో రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు చేయాలి.
పిల్లలను శారీరకంగా మానసికంగా శిక్షించడం వంటివి చేయరాదు, నాణ్యమైన విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళికలు తయారు చేయాలి, మూల్యాంకన విధానాలు రూపొందించేటప్పుడు పిల్లల సమగ్ర అభివృద్ధిని రాజ్యాంగ విలువలను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలని ఈ చట్టం పేర్కొంటోంది.
ప్రభుత్వ టీచర్ ప్రైవేట్ ట్యూషన్లు ప్రైవేట్ బోధనా పనులు చేపట్టకూడదు. టీచర్ నిష్పత్తి ప్రతి బడుల్లో ఉండేలా సంబంధిత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం చూడాలి. కానీ నేటి వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సినఅటువంటి పాఠ్య పుస్తకాలు డ్రెస్సులు ఇప్పటికీ అందలేదు, ప్రతి పాఠశాలలో RTE 2009 ప్రకారం తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు తరగతి గదులు, వసతి సౌకర్యాలు మొదలైనవి ఉండాలి, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు వారానికి కనీసం 45 గంటలు పని చేయాలి. ఉపాధ్యాయులు తమకున్న అపోహలు తొలగించుకొని బాలలహక్కుల దృక్పథంతో పనిచేస్తున్నారు, జ్ఞానం అంటే సమాచారం కాదని అది గత అనుభవాలు ఆలోచన ద్వారా ఉత్పన్నమవుతుందని ఉపాధ్యాయుడు భావిస్తాడు, పిల్లలను ఆలూరు ఆలోచింపజేసేలా ప్రతి చర్యలో భాగస్వామ్యం చేసేలా బోధనాభ్యసన ప్రక్రియ ఉపాధ్యాయుడు నిర్వహించాలి.
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో ప్రణాళిక ( కరికులం) ఉంటుంది. దీని ప్రకారం కార్యక్రమాలు అమలు చేయాలి. అన్ని సహాపాఠ్య విషయాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. బడి ఈడు పిల్లలు అందరు పాఠశాలలో చేరి విద్యను అభ్యసించాలి, విద్యా హక్కు చట్టం ప్రకారం చదువులో వెనుకబడిన పిల్లలకు అదనపు సమయంలో ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించాలి. భయారహిత దండన లేని పాఠశాల వాతావరణం ఉండాలి. పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్త పరిచే విధంగా తరగతి గది ఉండాలి. పిల్లల యొక్క జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు నిరంతరం మూల్యాంకన ద్వారా అంచనా వేస్తాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పిల్లలకు అవసరమైన తరగతి గదులు తాగునీరు మరుగుదొడ్లు కనీస సౌకర్యాలు కల్పించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రత్యేక స్కూలు నెలకొల్పాలి. విద్యాహక్కు చట్టం సరిగా అమలు కాకపోవడం వల్ల ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం సరిగా అమలు చేయకపోవడం వల్ల వందలు స్కూలు మూతబడి పోతున్నాయి తద్వారా పిల్లలకు అందాల్సినటువంటి ఉచిత నిర్బంధ విద్య అందకుండా పోతుంది.
కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలావరకూ విద్యా వ్యవస్థకు బడ్జెట్ ను తగ్గించాయి. దీని ద్వారా అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కొరతగా ఏర్పడుతున్నాయి. విద్యా వ్యవస్థకు బడ్జెట్ తగ్గించడంతో పాఠశాలల్లో సమస్యలు నాటికీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు దివాళా తీస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీని ద్వారా ఉచితంగా అందాల్సినటువంటి విద్య కాస్త ఖరీదైన సరుకుగా మారిపోతుంది. విద్యా హక్కు చట్టం అమలు చేయక లేకపోవడం వల్ల దేశ ప్రగతికి పట్టుకొమ్మలు గా ఉండాల్సిన అటువంటి ప్రాథమిక విద్య పతనం అయిపోతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు లేకపోతే విద్య అనేది పేదవారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.
రచయిత:
కర్రోల్ల రాజు బహుజన్,
బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు,
ఫోన్ 7093116119.
Share this content: