చరిత్ర సృస్టించిన ఆర్ఆర్ఆర్.. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేట‌గిరీలో ‘నాటునాటు’ కు ఆస్కార్

RRR, Oscars 2023 Award, Naatu Naatu Song, MM Keeravani, Chandrabose, Oscar, ఆర్ఆర్ఆర్, ఆస్కార్ అవార్డు, నాటు నాటు పాట, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ఆస్కార్,

దర్వాజ-

RRR’s ‘Naatu Naatu’ wins Best Original Song Oscars award: స‌రికొత్త చరిత్ర లిఖించబడింది.. ! ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ ‘నాటు నాటు’ గెలుచుకుంది. కోట్లాది మంది భార‌తీయుల‌ను సంతోషంతో ముంచెత్తింది. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ దేశానికి కీర్తిని మ‌రోసారి ప్ర‌పంచ న‌లుమూల‌ల‌కు వ్యాపింప‌జేసింది.

చిత్రబృందం తరఫున సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ అవార్డును స్వీకరించారు. గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, సంగీత దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆస్కార్ లో ‘ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో నామినేట్ అయిన తొలి తెలుగు పాట ‘నాటు నాటు’.

అంతకు ముందు గాయకులు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అమెరికన్ డ్యాన్సర్లు ఈ పాటకు డాన్స్ చేశారు.

నాటు నాటు సాంగ్ ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆస్కార్ గెల‌వ‌డంతో ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌ధాని మోడీ స‌హా అనేక మంది ప్ర‌ముఖులు చిత్ర యూనిట్ కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Related Post