మైనార్టీలకు రూ.లక్ష సాయం: రేప‌టి నుంచి చెక్కుల పంపిణీ చేయ‌నున్న తెలంగాణ ప్ర‌భుత్వం

తెలంగాణ‌, హైద‌రాబాద్, కేసీఆర్, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు, తెలంగాణ ప్ర‌భుత్వం, Telangana, Hyderabad, KCR, Panchayat Secretaries, Government of Telangana,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Rs 1 lakh aid for minorities in Telangana: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ రిలీఫ్ చెక్కుల పంపిణీని రేపు ప్రారంభించనున్నారు. గతంలో ఎగ్జిబిషన్ మైదానంలో జరగాల్సిన ఈ కార్యక్రమం ఇప్పుడు ఎల్బీ స్టేడియానికి మార్చారు. 100 మంది మైనార్టీ లబ్దిదారులకు కార్పొరేషన్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద రూ.లక్ష వరకు 1 శాతం సబ్సిడీ చెక్కులను కార్పొరేషన్ పంపిణీ చేయనుంది.

ఈ నెల 19న ఉదయం 10 గంటలకు సైఫాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో పంపిణీ జరగనుంది. జీహెచ్ ఎంసీ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు సహా 6000 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

లబ్ధిదారులకు మార్గదర్శకాలు..

మైనార్టీ లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, ఫొటోతో కూడిన తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ జారీ చేసిన బెనిఫిషియరీ ఆథరైజేషన్ లెటర్ తో ఉదయం 10 గంటలకల్లా ఎల్బీస్టేడియానికి చేరుకోవాలి. మహిళా లబ్ధిదారులు, వికలాంగులు తమ సహాయార్థం ఒక సహాయకుడిని వెంట తెచ్చుకోవచ్చు.

లబ్ధిదారులందరూ ఎల్బీ స్టేడియంలో దిగిన తర్వాత నిజాం కళాశాల మైదానం, పబ్లిక్ గార్డెన్ పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేయాలి. లబ్ధిదారులు ఎఫ్-గేట్ (ఎంట్రీ 6, 8), జీ-గేట్ (ఎంట్రీ-15) ద్వారా ఎల్బీ స్టేడియంలోకి ప్రవేశించి పంపిణీ ప్రారంభానికి ముందు కూర్చోవాలి.

Related Post