Loading Now
World Bank on India

ర‌ష్యా-ఉక్రెయిన్ వార్‌.. భాత‌ర జీడీపీ వృద్ధిపై ప్ర‌భావం.. వ‌ర‌ల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే..?

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

India’s GDP: ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధ ప్ర‌భావం ఇప్ప‌టికే ప్రపంచ దేశాల‌పై స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. భార‌త్ పై కూడా గ‌ణ‌నీయమైన ప్ర‌భావం చూపిస్తోంది. ఈ రెండు దేశాల యుద్ధం కార‌ణంగా భారత్ వృద్ధి రేటు అంచ‌నాలను త‌గ్గించింది. ఇదివ‌ర‌క‌టి అంచ‌నాల కంటే జీడీపీ వృద్ధి తగ్గుదలతో ఉంటుంద‌ని తెలిపింది. ఇంత‌కుముందు 8.7 శాతం జీడీపీ న‌మోద‌వుతుంద‌ని పేర్కొన్న ప్ర‌పంచ బ్యాంకు.. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో 8 శాతానికే ప‌రిమితం అవుతుంద‌ని అంచ‌నా వేసింది. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండ‌యాత్ర నేప‌థ్యంలో ధ‌ర‌లు పెరిగిపోవ‌డంతోపాటు స‌రుకుల‌ స‌ర‌ఫ‌రాలో అడ్డంకులు త‌లెత్తుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ద‌క్షిణాసియా ప్రాంతానికి చెందిన ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ హన్స్ టిమ్మర్ PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. భారతదేశం దీర్ఘకాలికంగా, శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లడానికి మరియు భాగస్వామ్యాన్ని పెంచడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.

2021-2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ అంచనా వృద్ధి 8.3 శాతంగా ఉందని, 2022-2023లో 8 శాతానికి, 2023 -2024లో 7.1 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంక్ తన తాజా సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ నివేదికలో పేర్కొంది.

Share this content:

You May Have Missed