దర్వాజ-హైదరాబాద్
Saidabad Incident: హైదరాబాద్‌లోని సైదాబాద్, సింగరేణి కాలనీలో ఆరేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి.. |హత్య చేసిన కేసులో నిందితుడైన రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజు ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా కనపడ్డాడు. అతడి రెండు చేతులపై మౌనిక అని ఉండే పచ్చ బొట్టుతో అది అతడి మృతదేహమేనని స్పష్టమైంది. రాజు కోసం పోలీసులు అన్ని ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టడంతో అతడు భయపడిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. తాజాగా పోలీసులు దీనిని నిర్ధారించినట్టు సమాచారం. అధికారికంగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, సెప్టెంబరు 9న సింగరేణి కాలనీలోని ఆరేళ్ల బాలిక అదృశ్యమైంది. చివరకు ఆమె నివసించే పక్కింట్లో ఉండే రాజు అనే యువకుడి ఇంట్లో ఆమె మృతదేహం లభ్యమైంది. అప్పటికే రాజు ఆ ఇల్లు వదిలి పారిపోయాడు. బాలికపై రాజు అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత చంపేసి, అక్కడి నుంచి పారిపోయాడని స్థానికులు ఆరోపించి, పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. రాజు గురించి సమాచారం అందిస్తే రూ.10 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటన చేశారు. ప్రస్తుతం సింగరేణి కాలనీలో పోలీసులు భారీగా మోహరించారు.
మోడీ పుట్టిన రోజునే ‘నిరుద్యోగ దినోత్సవం’
గుజారత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక క్రైమ్ రేటు
తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు
గుంటూరులో విద్యార్థిని దారుణ హత్య
ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల రాక్షస పాలన.. షరియా చట్టం