దర్వాజ- సిద్దిపేట్
Nangnoor-siddipet: నంగునూర్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గౌడ సంఘం వద్ద గౌడ కులస్థులు సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఆయన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ పౌరుషానికి ప్రతీక అని అన్నారు. ఆయన మొగల్స్ సైనికుల ఆగడాలపై ఎదురుదాడి చేసిన ధీరుడన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం సర్వాయి పాపన్న స్ఫూర్తిగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. అలాగే కల్లుగీత వృత్తిని సైతం గౌరవ ప్రదమైన స్థానంలో నిలిపిన ఘతన తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్, నంగునూర్ నల్లపోచమ్మ కమిటీ చైర్మన్ మహేందర్ గౌడ్, రైతుబందు సమితి గ్రామశాఖ అధ్యక్షులు సతీష్ గౌడ్, తాళ్లపల్లి వీరయ్య గౌడ్, రంగు రాజు గౌడ్, కోల రాజు గౌడ్, కోల చిన్న రమేష్ గౌడ్, ఆరే శ్రీనివాస్ గౌడ్, కోల శ్రీధర్ గౌడ్, కోల రామచంద్రం గౌడ్, ముస్మీర్ పర్శరాములు గౌడ్, గోనెపల్లి సిద్దేశ్వర్ గౌడ్, రంగు శ్రీనివాస్ గౌడ్, కిరణ్ గౌడ్, మల్లేశం గౌడ్, బూరుగు నర్సింలు గౌడ్, లక్కపల్లి నర్సింలు గౌడ్, బూరుగు శ్రీనివాస్ గౌడ్, ఎల్లయ్య గౌడ్, మండల గౌడ కులస్తులు పాల్గొనడం జరిగింది.
