దర్వాజ-హైదరాబాద్
Secunderabad-Tirupati Vande Bharat Express Ticket Price: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ రైలు కారణంగా మరింత సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. ఇందులో ఏడు ఏసీ చైర్ కార్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ క్యారేజ్‌లో 530 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రారంభమైన టిక్కెట్ల బుకింగ్స్.. ధర ఎంత?
శుక్రవారం నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 9న తిరుపతిలో, 10న సికింద్రాబాద్ లో రెగ్యులర్ రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు టిక్కెట్టు ధరలు జీఎస్టీ, తత్కాల్ సర్ చార్జీలతో కలిపి రూ.1,150 నుంచి ప్రారంభమవుతుంది. ఏసీ చైర్ కార్ క్యారేజీ టికెట్ ధర క్యాటరింగ్ కలుపుకుని రూ.1680 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ ధరలు రూ.3080 లుగా ఉన్నాయి.
ఏ సమయంలో బయలు దేరుతుంది..?
సికింద్రాబాద్ లో ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరుతుంది. ఉదయం 7.19 గంటలకు నల్లగొండకు చేరుకుంటుంది. 9.45 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. ఉదయం 11.09 గంటలకు రైలు ఒంగోలు, 11.29 గంటలకు నెల్లూరు చేరుకుంటుంది. 2.30 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

Read More…
వరుసగా 13వ నెల రూ.120 కోట్లు దాటిన తిరుమల హుండీ
దంచికొట్టిన వర్షం.. తెలంగాణలో రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్
బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత తనయుడు అనిల్.. ఏకే అంటోని రియాక్షన్ ఇదే.. !
కరోనా వైరస్ విజృంభణ.. భారీగా కొత్త కేసులు నమోదు