Loading Now
Anil Antony

బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత త‌న‌యుడు అనిల్.. ఏకే అంటోని రియాక్ష‌న్ ఇదే.. !

దర్వాజ-న్యూఢిల్లీ

Anil Antony Joins BJP: కాంగ్రెస్ కు మ‌రో షాక్ త‌గిలింది. మాజీ ర‌క్ష‌ణ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ అగ్ర నాయ‌కులు ఏకే అంటోనీ కుమారుడు అనిల్ అంటోనీ బీజేపీ లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లేఖ‌ను పంపిన ఆయ‌న తీవ్ర ఆరోపణ‌లు, విమ‌ర్శ‌లు చేశారు. గురువారం నాడు దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, వి.మురళీధరన్, కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ సమక్షంలో అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరారు. దేశ నిర్మాణం, జాతీయ సమైక్యత అనే ప్రధాని దార్శనికతకు తోడ్పడటం ఒక భారతీయ యువకుడిగా నా బాధ్యత, కర్తవ్యంగా భావిస్తున్నానని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు.

ఏకే అంటోనీ ఏమ‌న్నారంటే..?

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. దీని తర్వాత తండ్రి ఏకే ఆంటోనీ తొలి రియాక్షన్ వచ్చింది. తన కుమారుడి నిర్ణయంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. తిరువనంతపురంలో ఏకే ఆంటోనీ మీడియాతో మాట్లాడుతూ.. అనిల్ బీజేపీలో చేరడం తనను బాధించిందన్నారు. “ఇది చాలా తప్పుడు నిర్ణయం. భారతదేశానికి పునాది ఐక్యత, మత సామరస్యం. 2014 తర్వాత మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారు (బీజేపీ) ప్రణాళికాబద్ధంగా భిన్నత్వాన్ని, లౌకికవాదాన్ని దెబ్బతీస్తూ వస్తున్నారు. బీజేపీ కేవలం ఏకరూపతను మాత్రమే విశ్వసిస్తుందని, దేశ రాజ్యాంగ విలువలను నాశనం చేస్తోందని” అన్నారు.

Read More…

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ‌.. భారీగా కొత్త కేసులు న‌మోదు

జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ మహ్తో మృతి

హనుమాన్ జయంతి.. అలర్ట్ అయిన తెలంగాణ పోలీసులు !

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కి 14 రోజుల రిమాండ్.. ఖ‌మ్మం జైలుకు త‌ర‌లింపు

భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 200 దుకాణాలు

https://darvaaja.com/symptoms-before-heart-attack/

Share this content:

You May Have Missed