దర్వాజ-హైదరాబాద్
D Srinivas to rejoin Congress party: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో షాక్ తగలనుందా? మరో సీనియర్ నేత పార్టీ గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీనియర్ రాజకీయ నాయకులు, టీఆర్ఎస్ రాజ్యసభ మాజీ ఎంపీ డీ. శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం.
2004, 2009లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. కాగా, ప్రస్తుతం ఆయన కుమారుడు డీ.అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా (బీజేపీ) ఉన్నారు. డీ శ్రీనివాస్ పార్టీలో చేరిన తర్వాత రాహుల్ గాంధీపై లోక్ సభ అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ‘సత్యాగ్రహ’ నిరసనలో పాల్గొంటారని కాంగ్రెస్ తెలిపిందని సియాసత్ నివేదించింది. అయితే, దీనిపై డీ శ్రీనివాస్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆయన మరో కుమారుడు కాంగ్రెస్ లో చేరుతున్నారని సమాచారం.