దర్వాజ-అంతర్జాతీయం
Japan Former PM Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా, ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే, షింజో అబే ప్రాణాలు కోల్పోవడానికి సంబంధించిన కారణాలపై ఆస్పత్రి వర్గాలు కీలక వ్యాఖ్యలు చేశాయి. ఆయన అధికంగా రక్తాన్ని కోల్పోవడం మరణానికి కారణమైంది ఆస్పత్రి తెలిపింది. షింజో అబేను నారా మెడికల్ యూనివర్శిటీ ఆస్పత్రికి (స్థానిక సమయం) మధ్యాహ్నం 12:20 గంటలకు తరలించారు. సాయంత్రం 5:03 గంటలకు (స్థానిక కాలమానం) తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి బ్రీఫింగ్‌లో ప్రకటించింది.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఎన్నికల ప్రచారంలో కాల్పులు జరపడంతో నారా మెడికల్ యూనివర్సిటీకి తరలించిన దాదాపు ఐదు గంటల తర్వాత తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి శుక్రవారం వెల్లడించింది. “షింజో అబేను మధ్యాహ్నం 12:20 గంటలకు (స్థానిక కాలమానం) ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు ఆయన గుండె ఆగిపోయింది” అని నారా మెడికల్ యూనివర్శిటీ హాస్పిటల్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ హిడెటాడా ఫుకుషిమా వెల్లడించినట్టు జపాన్ మీడియా పేర్కొంది. ఆయన ప్రాణాలు కాపాడటానికి వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ, అబే సాయంత్రం 5:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మరణించారని పేర్కొంది.
షింజో అబే అధిక మొత్తంలో రక్తం కోల్పోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. దీనిని పూడ్చడానికి పెద్ద పరిమాణంలో రక్తమార్పిడి చేసినప్పటికీ వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు. ఆయన మెడ, ఛాతీపై గాయాలయ్యాయి. “మాజీ ప్రధాని భార్య అకీ అబే మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చారు. అతని మరణం గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించబడింది” అని ప్రొఫెసర్ ఫుకుషిమా మీడియాకు తెలిపారు. కాగా, షింజో అబే జపాన్ లో సుదీర్ఘకాలం పాటు ప్రధానమంత్రి, మొత్తం నాలుగు పర్యాయాలు పదవిలో కొనసాగారు.
Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిhttps://t.co/F4nzWN6rtC#ShinzoAbe #ShinzoAbeShot #Japan #NaraCity
— Darvaaja News (@DarvaajaNews) July 8, 2022
Share this content: