దర్వాజ-అంతర్జాతీయం
Japan Former PM Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా, ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే, షింజో అబే ప్రాణాలు కోల్పోవడానికి సంబంధించిన ఘటనకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి..
షింజో అబే హత్యా ఘటనకు సంబంధించిన జపాన్ మీడియ నివేదికల వివరాలు:
1. నారా ప్రాంతంలో 67 ఏళ్ల షింజో అబే తన ప్రసంగాన్ని ప్రారంభించిన నిమిషాల తర్వాత వెనుక నుండి కాల్చబడ్డాడు. పార్లమెంటు ఎగువ సభకు ఆదివారం జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
2. రెండు సార్లు కాల్పులు జరిపిన తర్వాత, షింజో అబే కుప్పకూలిపోయారు. తీవ్ర రక్తస్రావం అయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
3. అతను కాల్చబడినప్పుడు, అతను గుండె పోటుకు గురై బాధపడ్డారు. ఛాతీపై చేయి వేసుకుని కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే ఆయనకు కార్డియాక్ చికిత్స చేశారు.
4. ఈ క్రమంలోనే ఆయనను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన శ్వాస తీసుకోవడం లేదు. అతని గుండె ఆగిపోయింది.
5. షింజో అబే మెడకు కుడివైపున గాయపడి రక్తం కారిందని రెస్క్యూ అధికారులు చెబుతున్నారు. అతని ఎడమ ఛాతీలో అంతర్గత రక్తస్రావం కూడా ఉందని వారు చెప్పారు.
6. షింజో అబేను బతికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నందున ఆయన చనిపోయినట్లు ప్రకటించబడలేదు. అతనికి భారీ మొత్తంలో రక్తం ఎక్కించారు. అయితే, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన చనిపోయినట్లు ప్రకటించారని నివేదికలు పేర్కొన్నాయి.
7. జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా షింజో అబేపై జరిగిన దాడిని అనాగరికమైనదిగా పేర్కొన్నారు.
8. షింజో అబేపై కాల్పులు జరిపిన వ్యక్తిని యమగామి తెత్సుయాగా గుర్తించారు. నిందితుడు 2005 వరకు ఆ దేశ రక్షణ దళంలో పని చేసినట్లు సమాచారం.
9. కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడి నుండి పారిపోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయనందున వెంటనే అరెస్టు చేశారు. అతను చేతితో తయారు చేసిన తుపాకీని ఉపయోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అబేపై తనకు అసంతృప్తి ఉందని విచారణాధికారులతో చెప్పాడు. షింజో అబే నచ్చనందుకే ఈ దారుణానికి పాల్పడినట్టు తెలినట్టు జపాన్ మీడియా పేర్కొంది.
10. స్థానిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కార్యాలయం ప్రకారం.. గురువారం రాత్రి మాత్రమే నారాలో ప్రసంగించడానికి షింజో అబే.. నారా ప్రాంతానికి రావడానికి నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ విషయం ఆయన అనుచరులకు తెలియజేశారు.
Ex-Japan PM shot live updates: Former Japanese PM Shinzo Abe passes away#ShinzoAbeShot #Shinzo #shinzouAbe #Japan pic.twitter.com/Lck4ku4eXL
— Darvaaja News (@DarvaajaNews) July 8, 2022
Share this content: