Loading Now
Delhi, court, Aaftab Amin Poonawalla, killing, Shraddha Walkar,judicial custody, Mehrauli murder, మెహ్రౌలీ హత్య, జ్యుడీషియల్ కస్టడీ, ఢిల్లీ కోర్టు, అఫ్తాబ్ అమీన్ పూనావాలా , శ్రద్ధా వాకర్‌

శ్రద్ధా హత్య కేసు: ఆఫ్తాబ్ పూనావాలాకు పాలిగ్రాఫ్ పరీక్ష

Shraddha murder case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్ పూనావాలాకు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి కోర్టు ఢిల్లీ పోలీసులకు సోమవారం అనుమతి ఇచ్చింది. పాలీగ్రాఫ్ పరీక్షను లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా అంటారు. ఈ టెస్ట్ లో, కార్డియో కఫ్, సెన్సిటివ్ ఎలక్ట్రోడ్ లతో సహా పరికరాలు టెస్ట్ చేయబడుతున్న వ్యక్తికి జతచేయబడతాయి. అతడు/ఆమెని నిర్ధిష్ట ప్రశ్నలు అడిగినప్పుడు, ఇన్ స్ట్రుమెంట్ లు రక్తపోటు, రక్త ప్రవాహం, నాడి, శ్వాసక్రియ, శ్వాస లయలు, చర్మ వాహకత్వం, చెమట, చేయి, కాలు కదలికలను కొలుస్తూ.. రికార్డ్ చేస్తాయి.

మోసపూరిత సమాధానాలు (లేదా ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నప్పుడు) అతను/ఆమె నిజమైన వాస్తవాలను చెబుతున్నప్పుడు కాకుండా భిన్నమైన శారీరక ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. వ్యక్తి శరీరంలో మార్పులు, అతని/ఆమె శ్వాస విధానం, హృదయ స్పందన రేటు పరిశోధకులచే పర్యవేక్షిస్తారు. అఫ్తాబ్ పూనావాలాపై పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి తమకు అనుమతి ఇచ్చినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.

ఈ ఏడాది మే నెలలో తన లివ్ ఇన్ భాగస్వామి శ్రద్ధా వాకర్ ను అఫ్తాబ్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. శ్రద్ధాను చంపిన తరువాత, అఫ్తాబ్ ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, తరువాతి 18 రోజుల్లో పారవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నేరం జరిగిన 5 నెలలకు పైగా వెలుగులోకి వచ్చిన ఈ హత్యకు సంబంధించిన భయంకరమైన వివరాలు యావ‌త్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.

Share this content:

You May Have Missed