దర్వాజ-సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గం నంగు నూర్ మండలంలో నూతన ఆసరా పెన్షన్ పంపిణి కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు కి కొత్తగా పెన్షన్ మంజూరు అయిన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తమ ప్రభుత్వం తీసుకుంటున్నదని తెలిపారు.
మంత్రి హరీష్ రావు ప్రసంగంలోని కీలక అంశాలు..
- నూతన పెన్షన్లు 1117 మందికి, పాతవి ఆసరా 6975 మంది అందిచారు. మొత్తం 8092 మంది లబ్దిదారులు.
- కాంగ్రెస్ ప్రభుత్వం లో 200 రూపాయల పెన్షన్స్ ఉండే, ఇప్పుడు రూ 2016 ఇస్తున్నాము.
- మాట తప్పని నాయకుడు మన కేసీఆర్.. ఒక్కటిగా మన ప్రభుత్వం అన్ని చేస్తోంది.
- కాంగ్రెస్ ప్రభుత్వం ఆయాయంలో బోరు పొక్కలల్ల , మన కష్టం అంత పోయింది. నీళ్ల కోసం కష్టం ఉండే.
- కేసీఆర్ ఒక అపర భగీరథునిగా ఉండి, గోదావరి నీళ్లు మనకు వచ్చినవి.
- యాసంగి లో బోరు బండ్లు కనిపిస్తలేవు.. బోర్లు వెళ్లబోయబట్టే, ఇది మన కాళేశ్వరం పుణ్యం.
- ఒకరు ఢిల్లీలో కూర్చుంది మాట్లాడుతారు, కాంగ్రెస్,బీజేపీ వాళ్ళను ఓక్కసారి పట్టు కొచ్చి పేట చెరువులో ముంచుమన్న.. కాలేశ్వరం నీళ్లు వచ్చిన లేవో తెలుస్తది.
- మనం నాట్లు వేయాలంటే ఇతర రాష్ట్రాల నుంచి మగ మనుషులు వచ్చి నాట్లు చేస్తున్నారు..వడ్లు లారీలో ఎక్కియ్యడానికి బీహార్ హమాళిలు వస్తున్నారు.
- ఢిల్లీ బీజేపీ , కర్ణాటకలోడబుల్ ఇంజన్ అంటున్నారు..అక్కడ పెన్షన్ రూ 200..
- బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నారా..ఇస్తే చెప్పండి.
- కొంత మంది నోటి కచ్చినట్లు మాట్లాడుతున్నారు.
- తెలంగాణ లో ఒక గుంట భూమి కొని, పైపు లైన్ ద్వారా నీళ్లు మహారాష్ట్రకు తీసుకెళ్తున్నారు.
- కేసీఆర్ సారు కు మీ అందరూ చల్లని దీవెనలు ఇవ్వండి.
కాగా, ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు, లబ్దిదారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు..