Siddipet: వినాయక లా కాలేజీలో ‘పరిచయ్ 2k23’ జోష్.. !

దర్వాజ-సిద్దిపేట‌

Siddipet: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లి గ్రామంలోని వినాయక లా కళాశాలలో శనివారం పరిచయ కార్యక్రమం (పరిచయ్ 2k23) నిర్వహించారు.

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లి గ్రామంలోని వినాయక లా కళాశాలలో శనివారం పరిచయ కార్యక్రమం (పరిచయ్ 2k23) నిర్వహించారు. వినాయక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల లోని సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థు లకు స్వాగతం పలికారు.

కళా శాలలో న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థుల పరిచయ కార్యక్రమం ఉత్సాహ భరితంగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యంతం అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ రాజు మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరూ న్యాయ శాస్త్రం పై పట్టు సాధించాలని అన్నారు. న్యాయ శాస్త్రం ద్వారా సమాజ సేవ చేయాలని ఆయన సూచించారు.

Vinayaka-Law-College-Siddipet-1024x576 Siddipet: వినాయక లా కాలేజీలో 'పరిచయ్ 2k23' జోష్.. !

పటిష్టమైన ప్రణాళికతో కృషి చేస్తే విజయం సాధించడం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రేఖా రాణి, కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్ర ప్రసాద్, అధ్యాపకులు అనిల్ కుమార్, పరంధాములు తదితరులు పాల్గొన్నారు.

By Nikhila

Related Post