Breaking
Tue. Nov 18th, 2025

గ్లోబల్ చేంజ్ మేకర్-2022 అవార్డుకు ఎంపికైన అలయన్స్ గవర్నర్ మోర అంజయ్య

Alliance Governor, Mora Anjaiah, Global Change Maker-2022 Award, అలయన్స్ గవర్నర్, మోరా అంజయ్య, గ్లోబల్ చేంజ్ మేకర్-2022 అవార్డు,

ద‌ర్వాజ‌-సిద్దిపేట

Global Change Maker-2022 Award: ఇండియా స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండిపెండెన్స్ ఇంటర్నేషనల్ , ఇండియన్ యూత్ డే సంబరాలలో భాగంగా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సావాలను పురస్కరించుకొని నంగునూర్ గ్రామానికి చెందిన అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 137 B కరీంనగర్ జిల్లా గవర్నర్ అల్లీ మోర అంజయ్య నేషనల్ గ్లోబల్ చేంజ్ మేకర్ అవార్డ్ కు ఎంపికైనట్లు ఇండియన్ స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ ఆకుల రమేశ్ తెలిపారు. ఈ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమం సెప్టెంబర్ 10 న హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోని ఎన్టీఆర్ ఆడిటోరియం లో అతిధుల సమక్షంలో అందజేయనున్నట్లు తెలిపారు.

గత రెండు దశబ్దాలుగా మోర అంజయ్య కొన్ని వేల మందికి విద్య అందిస్తూ లయన్స్ అలయన్స్, రెడ్ క్రాస్, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజసేవ లో ఉన్నారనీ, వృద్ధాశ్రమం గో ఆశ్రమం ల ద్వారా సేవ చేస్తున్నారని విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తు ఉన్నత చదువులను ప్రేరేపిస్తున్నందుకు గాను స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఛైర్మన్, ముఖ్య అతిథి, ప్రముఖ విద్యా వేత్తల చేతుల మీదుగా అవార్డ్ ను అందుకోబోతున్నారు. ఈ మేరకు పలువురు ప్రముఖులు అవార్డు గ్రహీతకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Post