Loading Now
Sri Lanka crisis, Sri Lanka economic crisis, economic crisis, Sri Lanka, anti-government groups, clashes , Sri Lanka crisis-violence, శ్రీలంక‌, శ్రీలంక సంక్షోభం, శ్రీలంక ఆర్థిక సంక్షోభం, మ‌హీందా రాజ‌ప‌క్సే, గొట‌బ‌య రాజ‌ప‌క్సే, ఘ‌ర్ష‌ణ‌లు, అల్ల‌ర్లు,

Sri Lanka crisis: శ్రీలంక‌లో చెల‌రేగుతున్న హింస.. ఐదుగురు మృతి.. 225 మందికి గాయాలు !

దర్వాజ-కొలంబో

Sri Lanka crisis-violence : అంతర్యుద్ధ పరిస్థితులకు దారితీసిన అత్యంత దారుణమైన ఆర్థిక పరిస్థితిని శ్రీలంక ఎదుర్కొంటోంది. సోమవారం ప్రతిపక్షాలు, ప్ర‌జ‌ల‌ ఒత్తిడితో ప్రధానమంత్రి మహింద రాజపక్స రాజీనామా చేసినప్పటికీ హింస అంతమయ్యేలా కనిపించడం లేదు. రాజపక్సే కుటుంబానికి మద్దతుదారులు మరియు ప్రత్యర్థుల మధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 225 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక ఆందోళనకారుల మధ్య జరిగిన హింసాకాండలో అధికార పార్టీ ఎంపీ సహా ఇప్పటి వరకు 5 మంది చనిపోయారు. ఆర్థిక సంక్షోభం శ్రీలంక‌ను తాకినప్పటి నుండి అతిపెద్ద ఘర్షణలు సోమవారం ఉదయం రాజపక్స కుటుంబ మద్దతుదారులు విధ్వంసానికి దిగడంతో ప్రారంభమయ్యాయి.

శ్రీలంక ప్రధాని మ‌హీందా రాజ‌ప‌క్సే సోమవారం త‌న పదవికి రాజీనామా చేశారు. దేశం స్వాతంత్య్రం పొందిన త‌ర్వాత ఎప్పుడు చూడ‌ని సంక్షోభ ప‌రిస్థిత‌లు, ప్ర‌జా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల మ‌ధ్య ఆయ‌న త‌న ప‌ద‌విని వ‌దులుకున్నారు. రాజీనామా లేఖ‌ల‌ను అధ్య‌క్షుడు గొట‌డ‌య రాజ‌ప‌క్సేకు పంపారు. ఆయనతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి కూడా రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు. ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

కాగా, సోమ‌వారం అధ్యక్షుడు గోటబయ రాజపక్స కార్యాలయం వెలుపల హింసాత్మక ఘర్షణ చెలరేగింది. ప్రభుత్వ అనుకూల వర్గాలు నిరసనకారులపై దాడి చేయడంతో 225 మందికి పైగా గాయపడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించి రాజధానిలో సైన్యాన్ని మోహరించింది.

Sri-Lanka-•-Mahinda-Rajapaksa-1024x576 Sri Lanka crisis: శ్రీలంక‌లో చెల‌రేగుతున్న హింస.. ఐదుగురు మృతి.. 225 మందికి గాయాలు !

పౌరులు సంయమనం పాటించాలని మహీందా రాజపక్సే ట్విట్టర్‌లో కోరారు. “మన సాధారణ ప్రజలను సంయమనం పాటించాలని మరియు హింస హింసను మాత్రమే కలిగిస్తుందని గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. మనం ఉన్న ఆర్థిక సంక్షోభానికి ఆర్థిక పరిష్కారం అవసరం, ఈ పరిపాలన పరిష్కరించడానికి కట్టుబడి ఉంది” అని ఆయ‌న ట్వీట్ చేశారు.

శ్రీలంకలో ఎమ‌ర్జెన్సీ

కాగా, శుక్రవారం, అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కేవలం నెల రోజుల వ్యవధిలో శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది రెండోసారి.

ఆర్థిక సంక్షోభం

దాదాపు నెల రోజులుగా శ్రీలంక‌లో సంక్షోభం మ‌రింత‌గా ముదిరింది. శ్రీలంక ఇంధనం, మందులు మరియు విద్యుత్ సరఫరా కొరతను ఎదుర్కొంటోంది. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ సంక్షోభం కొంతవరకు విదేశీ కరెన్సీ లేకపోవడం వల్ల ఏర్పడింది, దీని అర్థం దేశం ప్రధాన ఆహారాలు మరియు ఇంధనం దిగుమతుల కోసం చెల్లించలేని పరిస్థితికి కార‌ణమైంది.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక నిర‌స‌న‌లు

ఏప్రిల్ 9 నుండి శ్రీలంక అంతటా వేలాది మంది ప్రదర్శనకారులు వీధుల్లోకి వచ్చారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

Sri-Lanka-•-Mahinda-Rajapaksa-3-1024x576 Sri Lanka crisis: శ్రీలంక‌లో చెల‌రేగుతున్న హింస.. ఐదుగురు మృతి.. 225 మందికి గాయాలు !

Share this content:

You May Have Missed