Loading Now
Sri Lanka hikes fuel prices: petrol at all-time high of Rs 420, diesel Rs 400 per litre

fuel prices: వామ్మో అక్క‌డ లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.420.. డీజిల్ రూ.400 !

దర్వాజ-అంతర్జాతీయం

Sri Lanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేప‌ధ్యంలో ఆ దేశ ప్ర‌జ‌ల క‌ష్టాలు మ‌రింత‌గా పోరుగుతున్నాయి. ఇప్పటికే నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశాన్ని తాకి తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న అక్క‌డి ప్ర‌జ‌లపై ప్ర‌భుత్వం మ‌రో భారం మోపింది. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచింది. మంగళవారం పెట్రోల్ ధరను 24.3 శాతం, డీజిల్‌పై 38.4 శాతం పెంచింది. దీంతో గ‌తంలో ఎప్పుడు లేనివిధంగా దేశంలో చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి. ఆర్థిక సంక్షోభ ప‌రిస్థితుల మ‌ధ్య ఏప్రిల్‌ 19 నుండి రెండవసారి శ్రీలంక ఇంధన ధరలను పెంచింది. ప్ర‌స్తుతం లీట‌రు పెట్రోల్ ధ‌ర ప్ర‌స్తుతం రూ.420 కి చేర‌గా, డీజిల్ ధ‌ర ఏకంగా లీట‌ర‌కు రూ.400కు పెరిగింది.

ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెరుగుద‌ల గురించి ఆ దేశ విద్యుత్ మరియు ఇంధన శాఖ మంత్రి కాంచన విజేసేకర ట్విట్టర్‌లో తెలిపారు. ధ‌ర‌ల స‌వ‌ర‌న‌లో అన్ని ప‌న్నులు, ఖ‌ర్చులు ఉంటాయ‌ని తెలిపారు.

Share this content:

You May Have Missed