దర్వాజ-రంగారెడ్డి
Srivari Brahmotsavam: దేవునిపడకల్ రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలంలోని దేవుని పడకల్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎంతో ప్రత్యేక ఉంది. ఈ ఆలయానికి 500 యేళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతుంటారు. ప్రతి యేడు ఈ గ్రామంలో వెంకటేశ్వర స్వామి జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా జనం తరలి వస్తారు. ప్రతియేట ఇక్కడ ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుపుతుంటారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు అశేష భక్తజనసంద్రంలో శ్రీ అలివేలు మంగ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది.
Share this content: