కేర‌ళ‌లో వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల‌దాడి..

Vande Bharat train

దర్వాజ-తిరువనంతపురం

Vande Bharat train in Kerala: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేతుల మీదుగా కేర‌ళ‌లో ప్రారంభ‌మైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పై మలప్పురం జిల్లాలో రాళ్ల‌దాడి జ‌రిగింది. తిరునావయ, తిరూర్ మీదుగా వెళ్తుండగా కొంద‌రు రైలుపై రాళ్లు విసిరారు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రైలులోని సీ4 బోగీలోని 62, 63 సీట్ల కిటికీలపై దుండగులు రాళ్లు రువ్వారు. మలప్పురం పోలీసులు, రైల్వే పోలీసు కేసు న‌మోదుచేసుకునీ, దర్యాప్తు ప్రారంభించిన‌ట్టు స‌మాచారం.

కాగా, కేరళలోని తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 25న ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్ర‌ధాని ప్రారంభించారు. రైలు పై రాళ్ల‌దాడి ఘ‌ట‌న‌ను కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ స్పందిస్తూ.. రాళ్ల‌దాడిని ఖండిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయ‌న షేర్ చేశారు.

Related Post