Breaking
Sat. Jun 28th, 2025

క‌రోనా కొత్త‌ వేరియంట్ XE ఎందుకంత ప్ర‌మాద‌క‌రం? దాని లక్షణాలు.. ఇప్ప‌టివ‌ర‌కు తెలిసిన వివ‌రాలు..

New Covid Variant XE
New Covid Variant XE

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Covid Variant XE: క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ XE (New Covid Variant XE) కేసులు భార‌త్ లో కూడా న‌మోద‌కావ‌డం పై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్తంమ‌వుతోంది. అయితే, ఎందుకు ఈ వేరియంట్ పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది? అంత‌లా ఎందుకు ఈ వేరియంట్ కు భ‌య‌ప‌డాల్సి వ‌స్తుంది? వైద్య నిపుణులు ఏమంటున్నారు? ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా కొత్త వేరియంట్ ఎక్స్ ఈ గురించి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ప్ర‌స్తుతం అంద‌ర్ని క‌ల‌వ‌రానికి గురిచేస్తున్నక‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ XE (New Covid Variant XE) ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న అన్ని కోవిడ్‌-19 వేరియంట్ల కంటే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దిగా అంచ‌నాలు ఉన్నాయి.
  2. ఇది ఇప్ప‌టివ‌ర‌కు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కోవిడ్‌-19 ఒమిక్రాన్ వేరియంట్ లో భాగంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) వెల్ల‌డించింది.
  3. ఇప్ప‌టివ‌ర‌కు తెలిసిన వివ‌రాల ప్ర‌కారం క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ XE (New Covid Variant XE) ఒమిక్రాన్ స‌బ్ బేరియంట్ బీఏ.2 కంటే అత్యంత వేగంగా విస్త‌రిస్తుంద‌ని త‌మ ప్రాథ‌మిక ప‌రిశీల‌న‌లో వెల్ల‌డైంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
  4. క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ XE (New Covid Variant XE) క‌లిగించే ల‌క్ష‌ణాలు ఒమిక్రాన్ సంక్ర‌మ‌ణ‌ను పోలి ఉంటాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. దీని సంక్ర‌మ‌ణ కార‌ణంగా జ్వరం, గొంతు నొప్పి, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, చర్మం ద‌ద్దుర్లు, చికాకు, చ‌ర్మ రంగు మారడం, జీర్ణశయాంతర బాధలు వంటివి ఉంటాయి.
  5. క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ XE (New Covid Variant XE) మొద‌టిసారిగి ఈ ఏడాది జ‌న‌వ‌రి 19న UKలో గుర్తించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 637 కేసులు నమోదయ్యాయి.
  6. UK హెల్త్ బాడీ మూడు రీకాంబినెంట్ వేరియంట్‌లను గుర్తించింది… అవి XD, XE మరియు XF. XD అనేది BA.1 ఓమిక్రాన్ వేరియంట్కు చెందిన హైబ్రిడ్ వేరియంట్. XF అనేది డెల్టా మరియు BA.1 రీకాంబినెంట్ వెర్షన్.
  7. క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ XE (New Covid Variant XE) కేసులు థాయిలాండ్ మరియు న్యూజిలాండ్‌లలో కూడా కనుగొన్నారు. వీటితో పాటు మ‌రికొన్ని దేశాల‌కు కూడా ఈ వేరియంట్ వ్యాపించిద‌ని ప‌రిశోధ‌కులు అంచనా వేస్తున్నారు.
  8. క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ XE (New Covid Variant XE) గురించి ఇప్పుడే ఓ క‌చ్చిత‌మైన నిర్ణ‌యానికి రాలేమ‌నీ, దీని గురించి మ‌రింత డేటా రావాల్సిన అవసరముంద‌ని WHO పేర్కొంది.
  9. క‌రోనా వ్యాధి తీవ్రతలో XE మరింత తీవ్రమైనదని ఎటువంటి ఖ‌చ్చిత‌మైన ఆధారాలు లేవు.. కానీ అన్ని Omicron వేరియంట్‌లు ఇప్పటివరకు తక్కువ తీవ్రతను కలిగి ఉన్నాయి.. అయితే, వీటి వ్యాప్తి వేగంగా ఉంది.
  10. XE అనేది BA.1 మరియు BA.2 ఓమిక్రాన్ జాతుల యొక్క “పునఃసంయోగ” ఉత్పరివర్తనం. కోవిడ్ యొక్క బహుళ వైవిధ్యాల ద్వారా రోగి సోకినప్పుడు రీకాంబినెంట్ మ్యుటేషన్‌లు వెలువడతాయి.
  11. వైవిధ్యాలు ప్రతిరూపణ సమయంలో వాటి జన్యు పదార్థాన్ని మిళితం చేస్తాయి.. దీంతో కొత్త ఉత్పరివర్తనను ఏర్పరుస్తాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Related Post