Breaking
Tue. Nov 18th, 2025

త‌మిళ‌నాడుపై హిందీని రుద్దితే.. కేంద్రానికి డీఎంకే హెచ్చ‌రిక‌లు

Chennai, DMK, M K Stalin, Udayanidhi Stalin, protest, Centre, Hindi, Tamil Nadu, హిందీ, త‌మిళ‌నాడు, డీఎంకే, స్టాలిన్, ఉద‌య‌నిధి స్టాలిన్,

దర్వాజ-చెన్నై

Chennai: తమిళనాడుపై హిందీని రుద్దితే ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు. వల్లువర్ కొట్టం సమీపంలో భారీ నిరసనకు నాయకత్వం వహించిన ఆయ‌న‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలను విస్మరిస్తే పార్టీ మూగ ప్రేక్షకురాలిగా మిగిలిపోదని అన్నారు. కేంద్రంపై పోరుకు దిగుతుంద‌ని హెచ్చ‌రించారు.

“తమిళుల మనోభావాలను పట్టించుకోకుండా హిందీని ప్రయోగిస్తే, తమిళనాడు వెలుపల కూడా నిరసన తీవ్రతరం చేసి, ముఖ్యమంత్రి అనుమతితో న్యూఢిల్లీకి తీసుకెళ్తాం” అని ఉదయనిధి ఒక భారీ సభను ఉద్దేశించి అన్నారు. కాగా, పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసుల నేపథ్యంలో డీఎంకే యువజన విభాగం, విద్యార్థి విభాగం హిందీ విధింపున‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహించారు.

Related Post