దర్వాజ-హైదరాబాద్
Telangana Election Results 2023: మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో గురువారం ఉదయం 7 గంటలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తెలంగాణలో పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం ముగింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియగా, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు ఓటు వేశారు. అయితే, పలు ప్రాంతాల్లో క్యూలో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండటంతో రాత్రి 8 గంటల వరకు కూడా కొన్ని కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది.
119 స్థానాలున్న తెలంగాణ శాసనసభకు గురువారం జరిగిన ఎన్నికల్లో కొన్ని చిన్న సంఘటనలు మినహా 70.60 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార పీఠాన్ని గద్దె దించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పలువురు అగ్రనేతలు రాష్ట్రంలో ర్యాలీలు నిర్వహిస్తూ బీజేపీ విస్తృత ప్రచారం నిర్వహించింది. అయితే, గురువారం వెలువడిన చాలా ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్ కు లాభిస్తాయని అంచనా వేశాయి.