• మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు
దర్వాజ-అమరావతి
Chandrababu Naidu Crying: ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం వెల్లడించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందనీ, ఇలాంటి అసెంబ్లీలోకి మళ్లీ అధికారంలోకి వచ్చాకే అడుగుపెడతానని శపథం చేశారు. ఇంతటి ఘోరమైన సభను తాను ఇంత వరకు చూడలేదని అన్నారు. అధికార పార్టీ కౌరవ సభలా నిర్వహిస్తోందన్నారు. ప్రతిపక్ష నేత కుటుంబంలోని మహిళలను కూడా సభలో ప్రస్తావిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు.
ఈ నేపథ్యంలోనే మంగళగిరిలోని టీడీపీ కార్యాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. వెక్కివెక్కి ఏడ్చడం సంచలనంగా మారింది. ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ”నా భార్య రాజకీయాల్లోకి రాలేదు. ఆమెకు రాజకీయాలపై ఆసక్తి లేదు. వాళ్ల నాన్న రాజకీయాల్లో ఉన్నా, నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రొటొకాల్ సమయంలో తప్ప ఆమె ఏ కార్యక్రమంలోనూ కనపబడేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు ఆమెకు తెలియదు. నలుగురికి సాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఆమెకు మరొకటి తెలియదు. అలాంటి వ్యక్తిని కూడా డర్టీ పాలిటిక్స్‌కి లాగే పరిస్థితికి వచ్చారు. వ్యక్తిత్వాలపై దాడి చేస్తున్నారని” చంద్రబాబు అన్నారు.
AP Floods: 12 మంది మృతి.. పదుల సంఖ్యలో గల్లంతు
AP Rains: రాయలసీమను ముంచెత్తిన వరదలు
PM Modi: కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తాం: ప్రధాని మోడీ
బాయిల్డ్ రైస్ కొనం.. : కేంద్రం
EY-Refyne Survey : నెల కాకముందే జీతం ఖతం..
Nidhhi Agerwal : అమ్మో నిధి ఏంటి వైట్ కలర్ డ్రెస్ లో ఏంజెల్ లా మారింది?
ఈ పండుతో హార్ట్ ఎటాక్ కు చెక్ పెట్టొచ్చా?
Poorna : సారీ హొయలతో ఆహా అనిపిస్తున్న పూర్ణ..
కంటినిండా నిద్రపోతే పొట్ట కరుగుతుందా?