Loading Now
heavy rainfall in telugu states

మ‌రో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వ‌ర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో గ‌డిచిన రెండు రోజుల నుంచి అక్క‌డ‌క్క‌డ ఒక మోస్తారు వ‌ర్షాలు ప‌డుతునే ఉన్నాయి. దీనికి కార‌ణం ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ఏర్పడ‌ట‌మేన‌ని వాత‌వ‌ర‌ణ కేద్రం తెలిపింది. దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో, ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమల‌లో తేలికపాటి నుంచి ఒక‌ మోస్తరు వర్షం ప‌డే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక దక్షిణ కోస్తాలో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవ‌కాశం ఉన్న‌ట్లు వాత‌వ‌ర‌ణ శాఖ తెలిపింది. ఏపీ‌ తీరం, దాని చుట్టుపక్క‌ల‌ ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్ప‌డింద‌ని వాత‌వ‌రణ శాఖ నిర్ధారించింది. దీని ప్రభావం ఏపీ, తెలంగాణ‌లో ఉంటుంద‌ని వాత‌వ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

అయితే శుక్రవారం ఉదయం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ప‌డుతున్నాయి. అలాగే తెలంగాణలోనూ ఒక మోస్తారు వ‌ర్షాలు ప‌డుతున్నాయి.ఇక మ‌హా న‌గ‌రం హైదరాబాద్‌లో గురువారం రాత్రి భారీ వర్షం ప‌డింది. దీంతో రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. ఇలాగే రానున్న రెండు రోజుల్లో కూడా ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. ఇలా ఉన్న‌ట్టుంది వాత‌వ‌ర‌ణం మార‌డంతో రెండు రాష్ట్రాల్లోకి రైతులు ఆదోళ‌న‌కు గుర‌వుతున్నారు. పంట చేతికొచ్చే స‌మ‌యంలో ఈ వాన‌ల వ‌ల్ల న‌ష్టం వాటిళ్లుతుంద‌ని బాధ ప‌డుతున్నారు.

మేడారం జాతర‌కు వేళాయ‌రా..!

క‌డుపునొప్పి, విరోచ‌నాలు అయితే వెంటనే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

Share this content:

You May Have Missed