Loading Now
government holidays

వచ్చే ఏడాది పండుగలు, సెలవులు ఇవే..

దర్వాజ-హైదరాబాద్

Holidays 2022: ఇంకో నెల అయితే గడిపితే చాలు కొత్త సంవత్సరం లోకి అడుగుపెట్టబోతున్నం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 2022 లో వచ్చే సెలవులు, పండుగల తేదీలను ఖరారు చేసి ప్రకటించేసింది. అయితే వచ్చే ఏడాదిలో ఉండే పండగల తేదీలను, సెలవుల దినాల జాబితాను తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. మొత్తంగా 2022 లో సాధారణ సెలవులు 28 ఉండగా, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్టుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం నాడు ప్రకటించారు.

ఇక సెలవుల విషయానికొస్తే.. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1, సంక్రాంతి సందర్భంగా 15న, గణతంత్రదినోత్సవం జనవరి 26 న సెలవులు ఉన్నాయి. అలాగే మహాశివారాత్రి సందర్భంగా మార్చి 1 సెలవు గాకా.. హోళీ 18న, ఉగాది ఏప్రిల్ 2న , శ్రీరామనవమి 10 న ఉండగా.. అంబేద్కర్ జయంతి 14న, గుడ్ ఫ్రైడే 15న సెలవులు ఉన్నాయి.

అలాగే మే 3, 4 తేదీల్లో రంజాన్ పండుగ ఉంది. ఇకపోతే ఆగస్టు 15 స్వాతంత్ర్యదినోత్సవం, 25 సెప్టెంబర్ న బతుకమ్మ ప్రారంభం కానుంది. అలాగే అక్టోబర్ 5 వ తేదీన దసరా ఉండగా.. 9న మిలాద్ ఉన్ నబి పండుగ ఉంది. దీపావళి 25న, 25 డిసెంబర్ క్రిస్ మస్ కాగా పండుగలు ఉన్నయని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ఇకపోతే ఆదివారం, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాకు సెలవులు ఉన్నాయి.

Healthcare: పడకేసిన పట్టణారోగ్య వ్యవస్థ

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తేవాల్సిందే..

Masala: గరం మసాలాలను తింటే ఆ రోగాలు రావా?

CM KCR: రేపే ఢిల్లీకి.. తాడో పేడో తేల్చుకుంటాం

Shrutihaasan: ఆ సీన్స్ లేకుంటేనే సీనియర్ హీరోలతో నటిస్తానంటున్న శృతిహాసన్

‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’

AP Floods: 12 మంది మృతి.. ప‌దుల సంఖ్య‌లో గ‌ల్లంతు

AP Rains: రాయలసీమను ముంచెత్తిన వరదలు

Share this content:

You May Have Missed