Huge Rain lasehs Hyderabad: హైదరాబాద్ మళ్లీ నీటమునిగింది. శుక్రవారం కురిసిన భారీ వర్షం దాటికి నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గంటల వ్యవధిలోనే కుండపోతగా కురిసిన వానతో మహానగరం అతలాకుతలమైంది. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతాలతో పాటు దిల్ సుఖ్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, హయత్ నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, మణికొండ, బంజారాహిల్స్, మీర్ పేట, చంపాపేట, పెద్ద అంబర్ పేట, అనాజ్ పూర్, సైదాబాద్ ప్రాంతాలు జలమయమయ్యాయి.
దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని శివగంగా సినిమా థియేటర్ లోకి భారీ వరద నీరు చేరింది. అక్కడి కాంపౌండ్ వాల్ కూలడంతో అక్కడి 50 పైగా వాహనాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలతో పాటు నగరంలో నీట మునిగిన ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలావుండగా, మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు జారీ చేశారు.
లఖింపూర్ హింస: పోలీసుల ముందుకు కేంద్ర మంత్రి కుమారుడు
వాట్సాప్, ఫేస్ బుక్ లో మళ్లీ అదే సమస్య
యూపీ సర్కారు తీరుపై సుప్రీం అసంతృప్తి
తుమ్మును ఆపితే ఏం జరుగుతుందో తెలుసా?
రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న బేబమ్మ..
ఆఫ్ఘానిస్థాన్‌లో బాంబు పేలుడు.. 50 మంది మృతి
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడే కారు నడిపాడు: గాయపడ్డ రైతు